Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తమిళ హీరో శింబుపై వచ్చే పుకార్లు అన్నీ ఇన్నీ కావు. నయనతార మొదలుకుని హన్సిక దాకా ఎందరితోనో సాగిన ఆయన ప్రేమాయణం ప్రతిసారీ వార్తల్లో విషయమే. ఆయన సినీ రంగ ప్రవేశం నుంచి ఇప్పటిదాకా ఎన్నోసార్లు శింబు వారిని పెళ్లాడుతున్నారు… వీరిని పెళ్లాడుతున్నారు అంటూ వార్తలొచ్చాయి. కానీ అవేవీ నిజాలు కాకపోయినా వాటిని ఎప్పుడూ ఆయన ఖండించలేదు. కానీ తొలిసారి తనపై వచ్చిన ఓ పుకారుపై శింబు ఆగ్రహం వ్యక్తంచేశారు.
తమిళ బిగ్ బాస్ లో ఇటీవల వివాదాస్పదం అయిన ఓవియాను శింబు పెళ్లాడతారంటూ కోలీవుడ్ మీడియాలో వార్తలొచ్చాయి. బిగ్ బాస్ షోలో స్విమ్మింగ్ పూల్ లో దూకి ఆత్మహత్యాయత్నం చేసిన ఓవియాకు మద్దతుగా శింబు ట్వీట్లు చేశాడని , ఆమెను పెళ్లిచేసుకోటానికి కూడా తాను సిద్ధమే అని శింబు ట్వీట్ చేశారని సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేశాయి. దీనిపై శింబు స్పందించారు. ఈ వార్తలను ఖండిస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు.
తన పేరు, ప్రతిష్టలు తగ్గించటానికి కొందరు పనిగట్టుకుని అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని శింబు మండిపడ్డారు. కొందరు తన పేరుతో ఖాతా ప్రారంభించి ఇలా ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. కొన్ని పత్రికలు, చానెళ్లు కూడా నిజానిజాలు తెలుసుకోకుండా ఆ వార్తలను ప్రసారం చేయటం బాధకలిగించిందన్నారు. నకిలీ ఖాతాల నుంచి వచ్చిన విషయాలను ఎవరూ నమ్మొద్దని, తను అధికారికంగా చెప్పిన విషయాలనే ప్రసారం చేయాలని, పేపర్లలో ప్రచురించాలని ఆయన మీడియాకు విజ్ఞప్తి చేశారు. మొత్తానికి అనేక వివాదల నడుమ సాగుతున్న తమిళ బిగ్ బాస్ శింబును కూడా ఇరకాటంలో పడేసింది.
మరిన్ని వార్తలు: