Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
హాలీవుడ్ నిర్మాత హార్వే వైన్ స్టెన్ ఇప్పటికి 34 మందిపై రేప్ కి పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి. చాలా మంది హీరోయిన్స్ ఇన్నాళ్లు దిగమింగుకున్న అతని అకృత్యాల్ని ఒక్కొక్కరుగా బయట ప్రపంచానికి చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో హాలీవుడ్ నటి అలిస్సా మిలానో హార్వే మీద దండెత్తారు. అతనే కాదు ఏ మగవాడి చేతిలో అయినా ఈ దారుణాలకు గురైన అందరు” మీ టూ ” అంటూ హాష్ ట్యాగ్ తో ఆ దుర్మార్గాల్ని బయట పెట్టాలని సూచించారు. ఈ విధంగా మిలానో చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మహిళలు ఈ ట్వీట్ మీద తమ అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు.
అలాగే గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ అయిన చిన్మయి కూడా ఆడవాళ్ళకి ఈ పరిస్థితి రావడం మీద ఆవేదన చెందారు. ఆ క్రమంలోనే ఆమె వెల్లడించిన ఓ విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆడవాళ్లు మాత్రమే కాదు తన స్నేహితులైన కొందరు మగవాళ్ళు కూడా తమ కన్నా వయసులో పెద్దవారైన మహిళల చేతిలో లైంగిక వేధింపులకు గురి అయిన విషయం తెలుసని చిన్మయి కామెంట్ చేశారు. ఆమె చేసిన ఈ కామెంట్స్ సంచలనం అయ్యాయి. హీరో రాహుల్ రవీంద్రన్ భార్య అయిన ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారాయి. అయితే ఇంటరెస్టింగ్ టాపిక్ రైజ్ చేసిన ఆమె అసలు ఆ పనికి పాల్పడింది ఎవరో అన్న సీక్రెట్ గానీ , బాధితులు ఎవరు అన్నది గానీ బయటపెట్టలేదు. ఇప్పుడు అదే విషయం మీద ఇటు టాలీవుడ్ అటు కోలీవుడ్ లో జోరుగా చర్చ సాగుతోంది.