ఇండియన్‌ సినీ చరిత్రలో మొదటిసారి..!

sundeep kishan movie getting re -released on December 15th

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ఒక సినిమా విడుదలైన తర్వాత సక్సెస్‌ అయితే పర్వాలేదు. ఫ్లాప్‌ అయితే ఆ సినిమాను రీ ఎడిట్‌ చేయడం, కొన్ని సీన్స్‌ను యాడ్‌ చేసి, కొన్ని సీన్స్‌ను డిలీట్‌ చేయడం చేస్తారు. అయితే అదంతా కూడా విడుదలైన వారం రోజుల్లోనే జరిగిపోతుంది. అలా ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా సినిమా మాత్రం పెద్దగా ఆడదు. కాని తాజాగా విడుదలైన ‘కేరాఫ్‌ సూర్య’ విషయంలో దర్శకుడు సుశీంద్రన్‌ షాకింగ్‌ నిర్ణయం తీసుకున్నాడు. తమిళంలో తెరకెక్కిన ఈ సినిమాకు యావరేజ్‌ టాక్‌ వచ్చింది. కాని దర్శకుడు మాత్రం సినిమాపై చాలా నమ్మకంగా ఉన్నాడు. సినిమా ఖచ్చితంగా బ్లాక్‌ బస్టర్‌ అవ్వాలని, మంచి సబ్జెక్ట్‌ అంటూ సినిమాను రీకాల్‌ చేశాడు.

sundeep-kishan-movie

దేశంలో ఇలాంటి సంఘటన జరగడం ఇదే ప్రథమం. ఒక సినిమా విడుదలైన తర్వాత దాన్ని రీకాల్‌ చేయడం జరగదు. కాని సుశీంద్రన్‌ మాత్రం సినిమా ఆడుతున్న ప్రతి థియేటర్‌ నుండి సినిమాను తొలగించాడు. నిర్మాత మరియు డిస్ట్రిబ్యూటర్‌ల సాయంతో దర్శకుడు సినిమా పూర్తిగా థియేటర్లలో లేకుండా చేశాడు. కొన్ని సీన్స్‌ యాడ్‌ చేసి, కొన్ని రీ షూట్‌ చేసి కొత్తగా సినిమాను విడుదల చేయాలని దర్శకుడు భావిస్తున్నాడు. డిసెంబర్‌ 15వ తారీకున తెలుగు మరియు తమిళంలో సినిమాను మళ్లీ విడుదల చేస్తామని, అప్పుడు ఖచ్చితంగా సినిమాను ప్రేక్షకులు ఆధరించడంతో పాటు, బాక్సాఫీస్‌ వద్ద మంచి కలెక్షన్స్‌ను కూడా రాబట్టగలదు అంటూ నమ్మకంగా చెబుతున్నారు. అప్పుడు రీ ఎడిట్‌ కార్యక్రమాలు మొదలు పెట్టాడు. దేశంలో మొదటిసారి సుశీంద్రన్‌ చేస్తున్న పని సక్సెస్‌ అయ్యేనా చూడాలి.