Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
గంగా ప్రక్షాళన కోసం నమామి గంగ ప్రాజెక్టు మొదలెట్టింది కేంద్రం. కానీ అనుకోని అవాంతరాలతో ఈ ప్రాజెక్టు ఆశించిన విధంగా ముందుకు సాగడం లేదు. గుజరాత్ సీఎంగా సబర్మతీని శుద్ధి చేసిన మోడీ… ప్రధానిగా గంగను మాత్రం ఏమీ చేయలేకపోతున్నారు. పైగా గంగా ప్రక్షాళనకు పౌరుల్లో కావాల్సలిన సామాజిక స్పృహ కూడా పెరగడం లేదు.
ఇదిలా ఉంటే ఉత్తరాఖండ్ హైకోర్టు గంగా, యమునలకు ఇచ్చిన ప్రాణుల హోదాను సుప్రీంకోర్టు కొట్టేయడం చర్చనీయాంశమైంది. కనీసం హైకోర్టు తీర్పుతో అయినా గంగా, యమునలకు ప్రాణం ఉందని మనుషులు భావిస్తారని, అలా అయినా కాస్త పద్దతిగా ఉంటారనుకున్న కేంద్రం ఆశలపై సుప్రీం నీళ్లు జల్లింది. గంగా, యమున ఎంత పవిత్రం అయినా ప్రాణులు మాత్రం కాదని తేల్చింది.
అయితే ప్రాణుల హోదా లేకపోయినా… నదులను శుద్ధి చేయడం పెద్ద విషయం కాదు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడం, ప్రజల నుంచి సహకారం అందకపోవడంతో… అనుకున్న పనులు జరగడం లేదు. అధికారంలోకి వచ్చి మూడేళ్లైనా గంగనే శుద్ధి చేయలేని బీజేపీ… ఇక రామమందిరం ఏం నిర్మిస్తుందని ఆరెస్సెస్ అగ్రనేతలు కూడా ఆగ్రహంగా ఉన్నారట.
మరిన్ని వార్తలు