వివాదాస్పద నటి శ్రీరెడ్డి తెలుగు సినిమా పరిశ్రమలోని కాస్టింగ్ కౌచ్ కు వ్యతిరేకంగా పోరాడుతున్న. పోరాడుతూ టాలీవుడ్ బడా నిర్మాత సురేష్ బాబు తనయుడు అభిరామ్ పై పలు సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.. అవకాశాల పేరుతో తనను అభిరామ్ మోసం చేశాడని కొద్ది రోజుల క్రితం శ్రీరెడ్డి తీవ్ర ఆరోపణలు చేసింది. దీనిపై పెద్ద పెద్ద వివాదాలే నడిచాయి. ఐతే దానిపై దగ్గుబాటి కుంటుంబం నుంచి ఎవ్వరూ ఏమీ మాట్లాడలేదు. కొంత కాలం పాటు సురేష్ బాబు అసలు బయటికే రాకుండా ఉండిపోయారు. ఇప్పుడు ఈ వ్యవహారం సద్దుమణిగాక తన కొత్త సినిమా ‘ఈ నగరానికి ఏమైంది’ ప్రమోషన్ల కోసం ఆయన మీడియా ముందుకొచ్చారు. ఆ సంధ్రభంగా అభిరామ్-శ్రీరెడ్డి ఇష్యూ గురించి ప్రశ్నించగా.. ‘అది నా పర్సనల్ సమస్య. దాన్ని నేను పరిష్కరించుకుంటా. దాన్ని ప్రజలతో పంచుకోవాలనే ఆసక్తి లేదు. నాకు మాత్రమే కాదు.. ఫ్యామిలీకి పర్సనల్ సమస్యలు ఉంటాయి. నేను లైమ్ లైట్ లోకి వచ్చాను. నా సమస్యలపై ప్రజలకు ఆసక్తి ఉంటుంది. కానీ నేను పబ్లిక్ పర్సన్ కాదు. నా వ్యక్తిగత జీవితానికి, నాకుటుంబానికి సంబంధించిన విషయాలు పబ్లిక్ లోకి తెచ్చుకోవడం నాకు ఇష్టం లేదు’ అని సురేష్ బాబు బదులిచ్చారు.
ఈ సందర్భంగా సినిమా విశేషాలతో పాటు టాలీవుడ్ లో చోటుచేసుకున్న పరిణామాలు, తన కుమారుడు అభిరామ్, శ్రీరెడ్డిల ఇష్యూ, అమెరికా సెక్స్ రాకెట్ పై ఆయన స్పందించారు. ‘తెలుగు సినిమా ఇండస్ట్రీ మీద ఈ మధ్యకాలంలో వచ్చిన నిందలు మన దురదృష్టం. ఇలాంటివి జరిగాయంటూ చెబుతున్నవి ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ మీద బ్రాండింగ్ అయ్యింది. ఒక డైమండ్ వ్యాపారి తప్పుచేస్తే అందరు వ్యాపారులనూ అలాగే చూస్తామా? ఒక రాజకీయ నాయకుడు తప్పు చేస్తే అందరు రాజకీయ నాయకులను అలాగే చూస్తున్నామా? అని ఆయన ప్రశ్నించారు. ఎక్కడా అందరూ తప్పుడు మనుషులే ఉండరని.. సినిమా ఇండస్ట్రీకి చెందిన కొందరు తప్పు చేస్తే ఇండస్ట్రీ మొత్తాన్ని తప్పుగా చూడటం సరికాదని ఆయనన్నారు. డ్రగ్స్, కాస్టింగ్ కౌచ్, వ్యభిచారం లాంటి మనుషులు పుట్టినప్పటి నుంచి జరుగుతున్నాయి. ఈ రోజు కొత్తగా మైదలైనవి కాదు. రాజుల కాలం నుంచి డ్రగ్స్, వ్యభిచారం ఉన్నాయి. ఆడ, మగ ఉన్న ప్రతిచోట ఇవి జరుగుతుంటాయి’ అని సురేష్ బాబు అన్నారు. దీన్ని బట్టి ఆయన తన కొడుకు చేసిన పనిని సపోర్ట్ చేసినట్టేనని కొందరు సోషల్ మీడియాలొ అభిప్రాయ పడుతున్నారు. కొడుకు వివాదాల్ని వెనకేసుకొచ్చిన సురేష్ బాబు వైఖరి ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.