శ్యామల ఎలిమినేషన్‌.. అసలేం జరిగింది!

syamala eliminated from bigg boss 2

బిగ్‌బాస్‌ సీజన్‌ 2 నుండి మరొకరు ఎలిమినేట్‌ అయ్యారు. మొదటి మూడు వారాల ఎలిమినేషన్‌ సాదా సీదాగా, ఊహించిన వారే ఎలిమినేట్‌ అయ్యారు. కాని నాల్గవ వారం మాత్రం ఎవ్వరు ఊహించని విధంగా యాంకర్‌ శ్యామల ఎలిమినేట్‌ అవ్వడం జరిగింది. ఇంట్లో బలమైన పార్టిసిపెంట్‌గా గుర్తింపు దక్కించుకున్న శ్యామల అర్థాంతరంగా వెళ్లి పోవడం ఏంటని అంతా కూడా షాక్‌ అవుతున్నారు. పిన్నిగారు అంటూ అందరితో ప్రశంసలు దక్కించుకున్న శ్యామల ఎందుకు ఇలా కార్నర్‌ అయ్యిందా అంటూ విశ్లేషకులు కూడా ముక్కున వేలేసుకుంటున్నారు. ఎలిమినేషన్‌లోనే ఉండదని శ్యామల గురించి అనుకున్నాం. కాని ఎలిమినేషన్‌లోకి వచ్చింది.

ఎలిమినేషన్‌లోకి వచ్చినా కూడా ఖచ్చితంగా ప్రేక్షకులు ఆమెను సేఫ్‌ చేస్తారు అనుకున్నారు. కాని అనూహ్యంగా ఆమెను బిగ్‌బాస్‌ నుండి ప్రేక్షకులు బయటకు పంపించేశారు. ఈసారి ప్రేక్షకులతో పాటు తేజస్వి మరియు కౌశల్‌ కూడా శ్యామల బయటకు వెళ్లేందుకు కారణం అయ్యారు. వారిద్దరి వద్ద ఉన్న పవర్‌తో ఆమెను బయటకు వెళ్లకుండా అడ్డుకోలేదు. వారిద్దరు కూడా ఒకరు నందినిని మరియు మరొకరు దీప్తిని సేవ్‌ చేయడం జరిగింది. చిన్నబాబు ఉన్న కారణంగా శ్యామలను సేవ్‌ చేయలేదు అంటూ ఇద్దరు కూడా అంటున్నారు. ఇక శ్యామల ఎలిమినేషన్‌ విషయం ఆదివారం ఉదయమే రివీల్‌ అయ్యింది. శ్యామల స్వయంగా సోషల్‌ మీడియాలో ఇంటికి వచ్చేశాను అంటూ పోస్ట్‌ చేసింది. ఆ పోస్ట్‌ను వెంటనే తొలగించినప్పటికి అప్పటికే అందరికి షేర్‌ అయ్యింది. బిగ్‌బాస్‌ సీజన్‌ 2 నాల్గవ ఎలిమినేషన్‌ శ్యామల అంటూ నిన్నంతా కూడా ప్రచారం జరిగింది. అనుకున్నట్లుగానే ఆమె ఎలిమినేషన్‌ అని తేలిపోయింది. శ్యామల ఎలిమినేషన్‌ సమయంలో చాలా భావోద్వేగంతో ఇంటి సభ్యులు కనిపించారు. ముఖ్యంగా దీప్తి మరియు గీతామాధురి, తేజస్విలు కన్నీరు మున్నీరు అయ్యారు. శ్యామల కూడా బయటకు వచ్చేసి కన్నీరు పెట్టుకుంది.