బాలీవుడ్ దర్శకుడు రోహిత్ శెట్టి దర్శకత్వంలో రణ్ వీర్ సింగ్, సారా ఆలీఖాన్ జంటగా రూపొందిన చిత్రం సింబా. ఈ చిత్రం క్రితం ఏడాది డిసెంబర్ 28 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాని ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ నిర్మించాడు. ఈ చిత్రం మొదటి రోజునుండి పాజిటివ్ టాక్ ను సంపాదించుకుని బాక్స్ ఆఫీస్ ని షాక్ కు గురిచేసింది. ఈ చిత్రం విడుదలైన 5 రోజులోనే 128 కోట్లు వసూళ్ళు చేసింది. ఇంత తక్కువ సమయంలోనే 100కోట్లు క్లబ్ లోకి చేరింది. రణ్ వీర్ సింగ్ యాక్షన్ సన్నివేశాలు సారా ఆలీఖాన్ తో రొమాన్స్ ఇవ్వని సింబా కు ప్లస్ పాయింట్స్ అయ్యాయి. రణ్ వీర్ సింగ్ దీపికను వివాహం చేసుకున్న తరువాత వచ్చిన చిత్రం అందులో మంచి విజయాని సొంతం చేసుకోవడంతో ఆనందానికి హద్దులేకుండా ఉన్నాడు. కథానాయక సారా ఆలీఖాన్ కూడా ఇప్పటివరకు సరైన హిట్ట్ పడలేదు.
సింబా సినిమా తరువాత సారా కూడా బిజీ అవ్వుతుందని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. సింబా చిత్రం తెలుగులో పురిజగన్నాద్ దర్శకత్వంలో ఎన్టీఆర్, కాజల్ అగర్వాల్ జంటగా వచ్చిన టెంపర్ సినిమాకు రీమేక్ కావడం విశేషం ఓ తెలుగు రీమేక్ సినిమా బాలీవుడ్ లో రికార్డ్స్ క్రియేట్ చెయ్యడం తెలుగు సినిమాకు గర్వకారణం అంటున్నారు సినిమా విశ్లేషకులు. టెంపర్ సినిమాను తమిళంలో మాస్ హీరో విశాల్ అయోగ్య పేరుతో రీమేక్ చేస్తున్నాడు. ఆ చిత్రం నుండి విడుదలైన ఫస్ట్ లుక్ కు తమిళ ప్రేక్షకులనుండి మంచి రెస్పాన్సు వచ్చింది.