Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
డ్రగ్స్ కేసు విచారణ వేగవంతం అయ్యింది. దాదాపుగా ఈ వారంలో తొలి విడత విచారణ పూర్తి అవుతోంది. ఏ ఏ హీరోలు ఏ రోజు సిట్ ముందుకు హాజరు కాబోతున్నారు అనే విషయం మీద క్లారిటీ వచ్చింది. అయితే ఈ కేసుకి సంబంధించి ఛార్మి, ముమైత్ ఖాన్ లని ఎప్పుడు విచారిస్తారు అనేదానిపై ఇంకా స్పష్టత రాలేదు. మిగిలిన వాళ్ళు ఎప్పుడు సిట్ ముందుకు వచ్చే తేదీలు ఇలా వున్నాయి.
ఈ నెల 22న సినీ హీరో తరుణ్‌ను విచారించనున్నారు. 24న మరో హీరో నవదీప్, 25న ఆర్ట్ డైరెక్టర్ చిన్నాను విచారించాలని నిర్ణయించారు. 26న చార్మిని విచారించాల్సి ఉండగా.. అధికారులకు ఆమె స్పష్టత ఇవ్వలేదు. మహిళలను వారు కోరుకున్న చోటే విచారించాలని సిట్ నిర్ణయించింది. కానీ చార్మి, ముమైత్‌ఖాన్‌లు ఇప్పటివరకు ఆప్షన్లు ఇవ్వలేదు. ఎన్ఫోర్స్మెంట్ అధికారులు చార్మితో శుక్రవారం మాట్లాడనున్నారు. చార్మి కోరుకున్న ప్రదేశానికే వచ్చి విచారిస్తామని చెప్పనున్నారు
మరిన్ని వార్తలు