Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ప్రజా సంకల్ప యాత్రకు ముందు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకోవడంపై కొత్త వివాదం చెలరేగింది. అన్యమతస్థుడైన జగన్ తిరుమల ఆలయంలో నిబంధనలు పాటించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. హిందూ ఆధ్యాత్మిక క్షేత్రంగా విరాజిల్లుతున్న తిరుమలలోకి అన్యమతస్థుల ప్రవేశం నిషిద్దం. ఒక వేళ వస్తే తమకు హిందూ విశ్వాసాల మీద నమ్మకం ఉందని తెలుపుతూ ఓ డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. అన్యమతస్థులు ఎవరొచ్చినా ఈ నిబంధన పాటించాల్సిందే.
అలాగే ఆలయం వద్దకు జగన్ ప్రవేశించిన తరువాత కొందరు టీటీడీ అధికారులు ఆయనకు ఎదురెళ్లి డిక్లరేషన్ ఇవ్వాలని కోరారు. వారివైపు జగన్ ఆగ్రహంగా చూశారు. తర్వాత తమాయించుకుని సున్నితంగా తిరస్కరించి దర్శనానికి వెళ్లిపోయారు. సంప్రదాయ దుస్తుల్లో ఆలయానికి వచ్చిన జగన్ డిక్లరేషన్ ఇవ్వడానికి మాత్రం నిరాకరించారు. దీనిపై హిందూ మత పెద్దలు మండిపడుతున్నారు.