Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
వైసీపీ అధినేత మానస పుత్రిక సాక్షి . అలాంటి సాక్షికి జగన్ హ్యాండ్ ఇవ్వబోతున్నాడు అంటే ఎవరికీ నమ్మబుద్ధి కాదు. కానీ ఇది నిజం అని జగన్ సన్నిహితులే కొందరు చెబుతున్నారు. దీనికి ప్రధాన కారణం సాక్షి మీద జగన్ నమ్మకం సడలిపోవడమేనట.
2009 ఎన్నికల టైం లో మీడియా అంతా మహాకూటమి గెలుపు సాధిస్తుందని అంటే ఒక్క సాక్షి మాత్రం భిన్నంగా కాంగ్రెస్ విజయం ఖాయమని చెప్పింది. ఆ నమ్మకంతోటే 2014 ఎన్నికల సమయంలోను సాక్షి టీం చెప్పిందే వేదంగా నడిచింది వైసీపీలో. కానీ ఫలితాల తర్వాత పరిణామాలు తెలిసిందే. ఇక సాక్షి పత్రిక లో ఏది రాసినా జనం పెద్దగా నమ్మే పరిస్థితి లేదని, పైగా సాక్షి పత్రిక, ఛానల్ వల్ల మిగతా మీడియా వైసీపీ కి దూరం అవుతోందని జగన్ గ్రహించగలిగారు. పైగా సాక్షి వల్ల అవుతున్న ఖర్చు కూడా తక్కువేమీ కాదు.
పైన చెప్పుకున్న పరిణామాలను అంచనా వేసుకున్న జగన్ ఇకపై సాక్షి కి క్రమంగా ప్రాధాన్యం తగ్గించి న్యూట్రల్ మీడియా గొడుగు కింద కొత్తగా ఓ ఛానల్, పత్రిక తేవాలని అనుకున్నారట. అయితే పైకి అది జగన్ కి సంబంధం ఉన్నట్టు కనిపించకూడదని భావిస్తున్నారు. ఇందుకోసం ప్రయత్నాలు కూడా మొదలు అయ్యాయి. జగన్ అనుకుంటున్న ఆ కొత్త పత్రిక , ఛానల్ మొదలు అయ్యాక క్రమంగా సాక్షి కి ప్రాధాన్యం తగ్గిస్తారట.