జగన్ కు తీవ్రమయిన అస్వస్థత… నేడు పాదయత్రకు బ్రేక్

Ys Jagan takes break from Praja Sankalpa Yatra

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

సుమారు ఆరు నెలలుగా ప్రజాసంకల్ప పాదయాత్రలో పాల్గొంటున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్, స్వల్ప అస్వస్థతకు గురయిన సంగతి తెలిసిందే. ఎండ వేడిమి ఎక్కువగా ఉన్నప్పటికీ, ఆయన పాదయాత్ర కొనసాగిస్తున్నందున వడదెబ్బ తగిలిందని ఆ పార్టీ నేతలు ప్రకటించారు. జలుబు, జ్వరం, తలనొప్పితో బాధపడుతున్నారని, అయినప్పటికీ, తన యాత్రను కొనసాగించారని జగన్‌ ఆరోగ్య పరిస్థితిని పరిశీలించిన వైద్యులు మూడు రోజులపాటు విశ్రాంతి తీసుకోవాలని ఆయనకు సూచించినా ఆయన పాదయత్ర కొనసాగిస్తుండంతో అస్వస్తత మరింత ఎక్కువయ్యింది.

దీంతో నేటి తన పాదయాత్రకు విరామం ఇచ్చిన జగన్, పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం సమీపంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. జగన్ ను కుటుంబ సభ్యులు పరామర్శించారు. ఆయన్ను పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేసేందుకు వైకాపా నేతలు క్యూ కట్టారు. కాగా, రేపు ఆయన హైదరాబాద్ కు వచ్చి నాంపల్లి సీబీఐ కోర్టుకు హాజరు కావాల్సివుంది. అయితే అనారోగ్యం కారణంగా కోర్టుకు జగన్ వెళ్తారా ? లేక రాలేకపోతున్నట్టు పిటిషన్ సమర్పిస్తారా? అన్న విషయమై స్పష్టత లేదు.