Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
సదావర్తి సత్రం భూముల కేసులో వ్యవహారాన్ని కాస్త లోతుగా పరిశీలిస్తే ప్రజల పేరుతో వైసీపీ 1000 కోట్లు లాభపడినట్టు అర్ధం అవుతుంది. ప్రజల మొహాన కేవలం 5 కోట్లు అదనంగా కొట్టేసి 1000 కోట్ల ప్రాపర్టీ ని వైసీపీ నేత కొట్టేసినట్టు అయ్యింది.చెన్నై సమీపంలో వున్న సదావర్తి సత్రం భూముల వేలంలో ఏపీ ప్రభుత్వం అక్రమాలకు పాల్పడినదని ఆరోపిస్తూ వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే కోర్టుని ఆశ్రయించారు. టీడీపీ సర్కార్ తనకు కావాలి అనుకున్నవారికి 83 ఎకరాల భూమిని కేవలం 22 కోట్లకు అప్పజెప్పిందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు ఆర్కే. అసలుకి ఆ భూముల ధర వెయ్యి కోట్లకి పై మాటే అని సాక్షి పత్రిక అప్పట్లో ఉదరగొట్టింది. కోర్టులోనూ భూముల ధర చాలా ఎక్కువ ఉంటుందని ఆర్కే తరపు న్యాయవాది వాదించారు. ప్రతిగా ప్రభుత్వ న్యాయవాది ఇప్పుడు చెల్లించిన ధర కన్నా ఐదు కోట్లు ఎక్కువ ఇస్తే ఆ భూములు అప్పగిస్తామన్నారు. దానికి ఓకే చెప్పిన ఆర్కే తరపున 22 కోట్లకన్నా 5 కోట్లు ఎక్కువ ఇచ్చి ఆ భూములు సొంతం చేసుకుంటే లాభం ఎవరికి వస్తుంది ? వైసీపీ కా , ప్రజలకా ? .
ప్రజాప్రయోజన వ్యాజ్యం వేసినప్పుడు దాని వల్ల లభించే ప్రతిఫలం ప్రజలకు దక్కాలి. కానీ సాక్షి చెప్పినట్టు ఆ భూముల విలువ 1000 కోట్ల పై మాట అయితే ఆ లాభం అంతకుముందు టీడీపీ నేతలకు దక్కితే, ఇప్పుడు వైసీపీ నాయకులకు దక్కుతుంది. దాని వల్ల ప్రజలకు అదనంగా ఒనగూరేదేమిటి ? ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించే ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. చివరకు ఈ ఎపిసోడ్ ఏ మలుపు తిరుగుతుందో ? కోర్టు ఇచ్చిన గడువు లోగా ఆర్కే ఆ డబ్బులు చెల్లించగలరా లేక చెల్లించినా మరో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు అవుతుందా?. ఈ ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.
మరిన్ని వార్తలు