పటేల్ సర్…తెలుగు బులెట్ రివ్యూ.

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

patel telugubullet review

బ్యానర్ :  వారాహి చలనచిత్రం 
నటీనటులు :  జగపతిబాబు, పద్మప్రియ జానకి రామన్ 
నిర్మాత :  కొర్రపాటి సాయి 
దర్శకత్వం : వాసు పరిమి  
మ్యూజిక్ డైరెక్టర్ :  డీజే వసంత్

డిటర్ : గౌతంరాజు 

సినిమాటోగ్రఫీ : శ్యామ్  కే నాయుడు 

దాదాపు ఐదేళ్ల తర్వాత జగపతి బాబు హీరోగా చేస్తున్న సినిమా “పటేల్ సర్ “. ఈ సినిమా పేరు, జగపతి బాబు లుక్, ట్రైలర్ కనిపించిన స్టైలిష్ టేకింగ్…ఇలా ప్రతి విషయం ‘పటేల్ సర్ ‘ మీద ఎక్కడ లేని ఆసక్తి రేపాయి. వాసు పరిమిని దర్శకుడిగా పరిచయం చేస్తూ వారాహి పతాకం మీద సాయికొర్రపాటి ఈ సినిమాని తెరకెక్కించారు. కంటెంట్ వున్న సినిమాల మీదే సాయి కొర్రపాటి దృష్ఠి ఉంటుందని సినిమా ఫీల్డ్ లో ఓ నమ్మకం. ఇక విలన్ గా హ్యాపీ గా కెరీర్ సాగిస్తున్న జగపతి ఇంకోసారి హీరోగా ప్రయత్నించడం అంటే పటేల్ సర్ లో గట్టి మేటర్ ఉందని జనం భావిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ మీద జగపతి ఇంటరెస్ట్ చూస్తుంటే కూడా పటేల్ సర్ మీద నమ్మకం పెరిగింది. జనాల్లో అంత పాజిటివ్ వైబ్ క్రియేట్ చేసిన ఈ సినిమా అంచనాలకు తగ్గట్టు వుందో, లేదో చూద్దామా!

కథ…

పటేల్ ( జగపతి బాబు )రిటైర్డ్ మేజర్. ఆయనకి తన కొడుకు కూడా మిలిటరీలోనే పని చేయాలని ఉంటుంది. అయితే అతను డాక్టర్ కావాలి అనుకుంటాడు. దీంతో తండ్రీకొడుకుల మధ్య తెలియని ఘర్షణ మొదలవుతుంది. ఆ ఇద్దరికీ సర్దిచెప్పలేక మేజర్ భార్య ( ఆమని ) నలిగిపోతుంది. తండ్రి ఇష్టానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న వల్లభ్ ఇంటి నుంచి వెళ్లిపోవాల్సి వస్తుంది. అయితే తల్లి ఆరోగ్యం దెబ్బ తిందని తెలిసి ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య ,పిల్లలతో కలిసి ఇంటికి వస్తాడు వల్లభ్ . మేజర్ కి కొడుకు మీద కోపం తగ్గుతుంది. హాయిగా సాగుతున్న వారి జీవితాల్లో పెనుతుఫాన్ ముసురుకుంటుంది. జగపతిబాబు అందుకు కారణమైన వారిపై ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు అన్నదే కథ. అయితే మాములు రివెంజ్ స్టోరీ కి స్టైలిష్ లుక్, అప్పీల్ తెచ్చిన ఘనత మాత్రం దర్శకుడు వాసు పరిమిదే.

విశ్లేషణ…

“పటేల్ సర్” ఫస్ట్ హాఫ్ చూస్తుంటే ఇదేదో మంచి స్టైలిష్ యాక్షన్ మూవీ అనిపిస్తుంది. అయితే కధని కాక ఏ హాలీవుడ్ మూవీని కాపీ కొట్టారేమో అనిపిస్తుంది. కానీ సెకండ్ హాఫ్ లోకి వచ్చేసరికి దర్శకుడు వాసు పరిమి లోతు ఏమిటో అర్ధం అవుతుంది. జగపతిబాబు కుటుంబంలో ఎమోషన్స్ కి సంబంధించి కొన్ని సీన్స్, వాటిలో జగపతి నటన చూస్తుంటే వెంట్రుకలు నిక్కబొడుచుకుంటాయి. కుటుంబ బాంధవ్యాలుని వాసు పరిమి టచ్ చేసిన తీరు బాగుంది. ఫస్ట్ హాఫ్ లో ఫైట్స్ ఎక్కువ అయ్యేసరికి ఇదేంటా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి ఆ లోటు తీరిపోతుంది. ఇక మ్యూజిక్, ఫోటోగ్రఫీ కూడా ఈ సినిమాకి ప్రాణం పోశాయి.

ప్లస్ పాయింట్స్ …

జగపతి బాబు నటన,స్టైల్
వాసు పరిమి దర్శకత్వం
సాయి కొర్రపాటి నిర్మాణ విలువలు
మ్యూజిక్
ఫోటోగ్రఫీ

మైనస్ పాయింట్స్ …

కథ ముందుగా అర్ధం కావడం.

తెలుగు బులెట్ పంచ్ లైన్ … “పటేల్ సర్ ” కి సెల్యూట్
తెలుగు బులెట్ రేటింగ్ …3 / 5 .