అనసూయ మొదట తన కెరీర్ ను బుల్లితెర యాంకర్ గా స్టార్ట్ చేసింది, ఆ తరువాత చిన్న చిన్న ప్రోగ్రామ్స్ చేస్తూ మంచి పేరును సంపాదించుకుంది. ఆ తరువాత ఈ టివి లో మల్లెమాల ప్రొడక్షన్స్ వారు జబర్దస్త్ కామెడీని స్టార్ట్ చేశారు. ఆ సమయంలో జబర్దస్త్ ప్రోగ్రాం కి అనసూయను యాంకర్ గా తీసుకున్నారు. అప్పటి నుండి తన కెరీర్ సాఫీగా సాగుతూ వచ్చింది. ఈ మద్యలో సినిమాలో అవకశాలు రావడంతో కొన్ని రోజులు జబర్దస్త్ కు దూరం అయింది. ఆ తరువాత సినిమాలో నటిస్తూనే మరల జబర్దస్త్ కు యాంకర్ గా రీ ఎంట్రీ ఇచ్చింది. అనసూయ జబర్దస్త్ నుండి తప్పుకున్నా సమయంలో యాంకర్ రేష్మి అనసూయ స్థానంలో కొనసాగింది. రేష్మికి జబర్దస్త్ ద్వార మంచి పేరు మరియు సినిమాలో అవకశాలు కూడా దక్కించుకుంది. అనసూయ జబర్దస్త్ లో రీ ఎంట్రీ కోసం కొన్ని రోజులు అగాలిసి వచ్చింది.
బంగారు బాతులాంటి జబర్దస్త్ కు టిఆర్పి రేటింగ్ విపరీతంగా పెరగడంతో జబర్దస్త్ షో కాస్త జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ రెండు షోస్ గా విడిపోయింది. అయినా కానీ జబర్దస్త్ కు మాత్రం మార్కెట్ తగ్గలేదు. జబర్దస్త్ కి మరల అనసూయ రీఎంట్రీ ఇచ్చింది. చాలా సంవత్సరాల వరకు అనసూయ తన యాంకరింగ్ గ్లామర్ తో ఇంకా అందం తెచ్చింది. ఈ మద్య కొన్ని వారలు గ్యాప్ రావడం, తన ప్లేస్ లో యాంకర్ వర్షిని రావడంతో అనసూయ మరల జబర్దస్త్ నుండి తప్పుకునది అనుకున్నారు. నిజానికి ఆమెకు ఉన్నా సినిమా డేట్స్ కారణంగా, కొద్ది వారలు గ్యాప్ ఇచ్చింది. తాజాగా విడుదలైన జబర్దస్త్ టిజర్ లో కనిపించడంతో మరల జబర్దస్త్ లోఅడుగు పెట్టిందనే క్లారిటీ వచ్చింది. ప్రస్తుతం ఆమె పైన జబర్దస్త్ కు సంబందించిన షూట్ చేస్తున్నారు అని ఈ టివి వారు వెల్లడించారు.