Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
AP CM Chandhra Babu Naidu better than Telangana CM KCR
పోయినోళ్లంతా మంచివాళ్ళే అన్న నానుడి మనుషులకే కాదు రాజకీయ పార్టీలకు కూడా వర్తిస్తుంది అనుకుంటా. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఒక్క సారి కూడా టీడీపీ, చంద్రబాబు గురించి మంచి మాట మాట్లాడని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పుడు ట్రాక్ మార్చేశారు. ఇక తెలంగాణాలో టీడీపీ పనైపోయిందని భావించి కాబోలు కోమటిరెడ్డి చంద్రబాబుకి ఊరటనిచ్చే మాట మాట్లాడారు. తెలంగాణ సీఎం కెసిఆర్ కన్నా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు పాలన బెటర్ అనేసారు కోమటిరెడ్డి.
కోమటిరెడ్డి ఇంతలా మాట్లాడడానికి పెద్ద కారణం ఏమీ లేదు. కెసిఆర్ అపాయింట్ మెంట్ దొరక్కపోవడమే. చంద్రబాబు సీఎం గా వున్నప్పుడు ఎప్పుడు అపాయింట్ మెంట్ అడిగినా తేలిగ్గా దొరికేదట కోమటిరెడ్డికి. ఇప్పుడు కెసిఆర్ సీఎం అయ్యాక ఆయన అపాయింట్ మెంట్ దొరకడం గగనం అయిపోయిందని ఆయన అన్నారు. కెసిఆర్ అసలు సెక్రెటేరియేట్ కి రావడం లేదని , అటు ప్రగతి భవన్ కి వెళ్లినా అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదని కోమటిరెడ్డి వాపోయారు. పరిస్థితి ఇలాగే మియాపూర్ లో ప్రభుత్వ భూముల్ని దొంగిలించినట్టే, ఇక సచివాలయ భూముల్ని కూడా ఎవరో ఒకరు కాజేస్తారని కోమటిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.
మరిన్నివార్తాలు:
అబ్బో … సిబిఐ హనుమంతుడి లెక్కన్న జగన్.
బాబు ప్రమాణం చేసిన చోటే వైసీపీ ప్లీనరీ.