మసాలా అంటే గ్లామరేనా?

audience about nani telugu big boss season 2

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

తెలుగు ప్రేక్షకులు బిగ్‌బాస్‌ సీజన్‌ 2 కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు బిగ్‌బాస్‌ ప్రారంభం అవుతుందా అని సినీ వర్గాల వారు కూడా ఎదురు చూస్తున్నారు. ఎన్టీఆర్‌ హోస్టింగ్‌ కాకపోవడంతో కాస్త నిరుత్సాహం ఉన్నప్పటికి ఈసారి మరింత మసాలా దట్టించి బిగ్‌బాస్‌ సీజన్‌ 2ను ప్రేక్షకుల ముందుకు స్టార్‌ మా వారు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ కారణంగా ఖచ్చితంగా ప్రేక్షకులకు మరింత వినోదం ఖాయం అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రోమోలో నాని కూడా ఈసారి మరింత ఎక్కువ మసాలా అంటూ అందరిలో ఆసక్తిని రేకెత్తించాడు.

ఇక్కడ మసాలా అంటే ఏంటా అని ప్రస్తుతం అంతా చర్చించుకుంటున్నారు. హిందీ బిగ్‌బాస్‌లో లేడీ పార్టిసిపెంట్లు గ్లామర్‌తో కిర్రాక్‌ చేస్తూ ఉంటారు. అయితే మొదటి సీజన్‌లో మాత్రం అలాంటివి ఏమీ లేదు. కాని రెండవ సీజన్‌లో లేడీ పార్టిసిపెంట్స్‌తో ఎక్స్‌పోజింగ్‌ చేయించాలని భావిస్తున్నారు. అందుకే ముగ్గురు లేదా నలుగురు ముద్దుగుమ్మలను ఎంపిక చేసి, వారిని ఒల్లుదాచుకోవద్దని సూచించినట్లుగా తెలుస్తోంది. మస్త్‌ మజా వచ్చేలా వారు ఎక్స్‌పోజింగ్‌ చేస్తారని, వారితో పాటు ఇతర పార్టిసిపెంట్స్‌ కూడా అందరిని ఆకట్టుకునేలా చేస్తారని స్టార్‌ మా వారు నమ్మకంగా ఉన్నారు. వచ్చే నెలలో ప్రారంభం కాబోతున్న బిగ్‌బాస్‌ సీజన్‌ 2 వంద రోజులు ప్రసారం కాబోతుంది. మొదటి సీజన్‌ కంటే 40 రోజులు అదనంగా అన్నమాట. ఇలా ఎక్కువ రోజులు కావడం వల్ల ఎక్కువ మంది పార్టీసిపెంట్స్‌ కనిపించే అవకాశం ఉంది. ఇక అన్నపూర్ణ స్టూడియోలో బిగ్‌బాస్‌ హౌస్‌ సెట్టింగ్‌ను నిర్మించారు.