Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బలపడటమే లక్ష్యమని బీజేపీ నేతలు పదేపదే చెబుతున్నారు. అమిత్ షా ఇప్పటికే గేమ్ ప్లాన్ రెడీ చేశారని గొప్పలు పోతున్నారు. కానీ తెలంగాణ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఏకైక బీజేపీ ఎంపీ దత్తాత్రేయను మాత్రం క్యాబినెట్ నుంచి తప్పించారు. పైగా ఆయన కార్మిక శాఖను సరిగా నిర్వహించలేదని అంటున్నారు.
అయితే ఇప్పుడు దత్తాత్రేయను ఎందుకు తొలగించారని తెలుగు రాష్ట్రాల్లో చర్చ మొదలైంది. తెలంగాణ బీజేపీతో పాటు ఏఫీ బీజేపీ నేతలు కూడా ఆరా తీస్తున్నారు. గతంలో కూడా దత్తాత్రేయను తీసేస్తారని పుకార్లు వచ్చినా.. ఆ పని జరగలేదు. ఈసారి మాత్రం సైలంట్ గా పని కానిచ్చేశారు మోడీ. పైగా కంటితుడుపుగా ఏదో రాష్ట్రానికి గవర్నర్ గా పంపిస్తామని చెబుతున్నారు.
మోడీ, షా మనసుకు నచ్చినట్లే ఉంటేనే బాగా పనిచేసినట్లా.. లేదంటే కానట్లా అనే అనుమానాలు వస్తున్నాయి. ఈ విషయంలో దత్తన్న స్వయంకృతం కూడా ఉంది. ఈ మధ్యకాలంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో కలిసిపోతున్న దత్తన్న.. గులాబీ కార్యకర్తలా వ్యవహరిస్తున్నారు. దత్తాత్రేయతో పాటు మరో ఏడుగురు కూడా రాజీనామా చేయడం చర్చనీయాంశమైంది.
మరిన్ని వార్తలు: