Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఈరోజు కంటబడిన దృశ్యం ఇప్పుడు ప్రజలని ఇదేమి రాజకీయంరా బాబోయ్ అనేట్టు చేస్తోంది. పవన్ కల్యాణ్ ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యల మీద ప్రభుత్వం సరైన శ్రద్ద చూపడం లేదని దీక్ష చేశారు. ఆయనకు మద్దతుగా అన్ని జిల్లాల్లో అభిమానులు, జనసేన నేతలు కూడా సంఘీభావ నిరాహర దీక్షలు చేస్తారని ప్రకటించారు అలాగే ఈరోజు దీక్షలు చేసారు కూడా. అయితే ఇందులో విశేషం ఏముంది అంటారా ? ఇక్కడే ఉంది అసలు విషయం రాజమండ్రిలో జనసేన తరపున వేసిన ఓ దీక్షా టెంటులో ఉన్న వారిని చూసి అక్కడ జనం తెల్ల మొహం వేశారు. ఎందుకంటే… అందులో ముఖ్య నాయకురాలు ఎవరో కాదు రాజమండ్రి సిటీ బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ భార్య లక్ష్మీపద్మావతి.
పవన్ చేస్తున్న కార్యక్రమాలు నచ్చాయని… ఆయనంటే అభిమానం అని చెబుతునా, ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణకు సంబంధం లేదని ఆమె చెబుతున్నా కానీ ఆమెతో పాటు కూర్చున్న వాళ్లంతా… ఆకుల సత్యనారాయణ అనుచరులే అవడం ఒక ప్రధాన పార్టీలో భర్త ఎమ్మెల్యేగా ఉండగా భార్య జనసేన జెండా కప్పుకుని ఆందోళన కార్యక్రమంలో పాల్గొనడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ జనసేన మధ్య రహస్య ఒప్పందాలు ఉన్నాయని టీడీపీ నేతలు చాలా రోజులుగా ఆరోపిస్తున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో ఎటూ బీజేపీ గెలిచే పరిస్థితి తెలిసిందే కాబట్టి… ముందు జాగ్రత్తగా ఆకుల సత్యనారాయణ తన భార్య రూపంలో జనసేనలో కర్చిఫ్ వేస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే ఎక్కడో కాంగ్రెస్ నుండి అరువు తెచ్చిన నాయకుడికి రాష్ట్ర అధ్యక్ష్యుడు పదవి ఇవ్వడం పట్ల కినుకు వహిస్తున్న ఆకుల సత్యనారాయణ ప్లాన్డ్ గానే ఇలా చేసారా అనే అనుమానాల్ని కూడా విశ్లేషకులు బయట పెడుతున్నారు.
రాష్ట్ర అధ్యక్ష పదవి తనకే కావాలంటూ కొద్దిరోజుల క్రితం ఢిల్లీలో ప్రయత్నాలు చేసిన సత్యనారాయణ ఆయనకు దక్కే అవకాశం లేదని తేలిన తర్వాత సోము వీర్రాజుకి ఇస్తే పార్టీని వీడిపోతానంటూ బెదిరించారు కూడా చివరకు కన్నా లక్ష్మీనారాయణను ఎంపిక చేయడంతో ఇక తప్పక ఆయన బాధ్యతలు స్వీకరిస్తున్న సందర్భంగా గుంటూరులో నిర్వహిస్తున్న బహిరంగసభకు కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే బయలుదేరారు. ఈ సమయంలో ఆమె దీక్షకు కూర్చోవడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది.