నాగార్జున నాని కథానాయకులుగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ‘దేవదాస్’ అనే మల్తీస్తారర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఆకాంక్ష సింగ్, రష్మిక మందన కథానాయికలుగా నటిస్తోన్న ఈ సినిమా నుంచి తాజాగా మరో లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. “ఏమో ఏమో ఏమో మెరుపుతీగ ఎదురై నవ్విందేమో .. ఏమో ఏమో ఏమో వెలుగు వాగు నాలో పొంగిందేమో ..” అంటూ నాని .. రష్మిక మందనలపై ఈ సాంగ్ సాగుతోంది. ప్రేమలో పడిన కుర్రాడు .. ఆ ప్రియురాలిని తలచుకుంటూ పాడుకునే పాట ఇది. సిరివెన్నెల పద ప్రయోగాలతో మణిశర్మ సంగీతంతో సిద్ శ్రీరామ్ గాత్రంతో ఈ పాటను హృదయాలను బరువేక్కిస్తోంది. మరింకెందుకు ఆలస్యం మీరూ ఒక చెవి వేసెయ్యండి మరి