Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
‘డీజే’కు నష్టాలు ఏంటా అని ఆశ్చర్యపోతున్నారా.. అవును నిజంగానే ‘డీజే’ చిత్రానికి నష్టాలు వచ్చాయని చిత్ర యూనిట్ సభ్యులు, సినీ వర్గాల వారు చెబుతున్నారు. శృతిమించిన బడ్జెట్‌తో ‘డీజే’ చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది. దిల్‌రాజు బ్యానర్లో మొదటి సారి అత్యంత ప్రతిష్టాత్మకంగా కథకు మించి బడ్జెట్‌ను కేటాయించడం కారణంగానే ఆ సినిమాకు నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. దిల్‌రాజుకు దాదాపు 15 కోట్ల నష్టం వచ్చి ఉంటుందనే టాక్ వినిపిస్తుంది. ‘డీజే’ కారణంగా వచ్చిన లాస్‌ను మరో మెగా హీరో వరుణ్ తేజ్ ‘ఫిదా’ చిత్రంతో భర్తీ చేస్తున్నాడు అనే వార్తలు వస్తున్నాయి.
వరుణ్ తేజ్, సాయి పల్లవి జంటగా తెరకెక్కిన ‘ఫిదా’ సినిమా గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. ఓవర్సీస్తో పాటు తెలుగు ప్రేక్షకులు ఆ సినిమాను విపరీతంగా ఆధరిస్తున్నారు. దాంతో సినిమాకు భారీగా వసూళ్లు వస్తున్నాయి. ఇప్పటికే డిస్ట్రిబ్యూటర్లు లాభాల భాట పట్టారని, దిల్‌రాజు ఏకంగా 25 కోట్ల లాభాలను ఫిదాతో దక్కించుకోనున్నట్లుగా తెలుస్తోంది. సినిమా సక్సెస్ అయిన నేపథ్యంలో ‘ఫిదా’ చిత్రాన్ని ఒక ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానెల్ భారీ మొత్తం పెట్టి కొనుగోలు చేసేందుకు ముందుకు వస్తుంది. ఆ కారణంగా ఫిదాకు మంచి లాభాలు వస్తున్నాయి. దిల్‌రాజుకు ఇది కామనే.. ఒక సినిమాకు కోటి పోతే మరో సినిమాకు మూడు కోట్లు వస్తూనే ఉంటాయి.
మరిన్ని వార్తలు: