కాపు రిజర్వేషన్ల విషయం మీద హోం మంత్రి చినరాజప్ప స్పందించారు.
- కాపు రిజర్వేషన్లపై కేంద్రంతో టీడీపీ ఎంపీలు చర్చిస్తారని త్వరలో రిజర్వేషన్లపై సంబంధిత మంత్రులతో ఏపీ బృందం చర్చిస్తుందని ఆయన అన్నారు.
- అన్ని హామీల్లానే కాపు రిజర్వేషన్లను కూడా కేంద్రం తొక్కిపెట్టిందని ఆయన విమర్శించారు.
- కాపు రిజర్వేషన్లపై చంద్రబాబు చిత్తశుద్దితో ఉన్నారని స్పష్టం చేశారు.
- కాపు రిజర్వేషన్లపై జగన్ యూటర్న్ తీసుకున్నారని, పవన్ ఇంకా ఏం చెప్పలేకపోయారని ఎద్దేవా చేశారు.
- ముద్రగడ చిత్తశుద్ది ఉన్న టీడీపీకి మద్దతిస్తున్నారన్నారు.
- కాపు కార్పొరేషన్ ద్వారా రూ.3 వేల కోట్లు ఖర్చు చేశామని చినరాజప్ప పేర్కొన్నారు.