పవన్‌ ఎవడు? ఆయన స్థాయి ఏంటీ.. స్వరం పెంచిన కత్తి

Kathi-mahesh-comments-on-pa

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

పవన్‌ కళ్యాణ్‌పై కత్తి మహేష్‌ చేస్తున్న విమర్శలు సంక్రాంతి తర్వాత తగ్గే అవకాశాలున్నాయని కొందరు ఆశాభావం వ్యక్తం చేశారు. కాని కత్తి మహేష్‌ సంక్రాంతి తర్వాత తన స్వరంను ఇంకాస్త పెంచాడు. పవన్‌ కళ్యాణ్‌ తనకు సారీ చెబితే తప్ప తాను శాంతించను అని, ఆయన అభిమానుల వల్ల తాను ఎంతో మానసిక క్షోభ అనుభవించాను అని, అందుకు ఆయన క్షమాపణలు చెప్పాల్సిందే అంటూ మొన్నటి వరకు అంటూ వచ్చిన కత్తి మహేష్‌ ఇప్పుడు ఆ స్వరంను మరింతగా పెంచాడు. పవన్‌ పక్కా పొలిటికల్‌ బ్రోకర్‌ అని, ఆయన ఒక పరిణితి లేని నాయకుడు అంటూ విమర్శించాడు. తాజాగా టీవీ9 ఇంటర్వ్యూలో నిర్మాత రాంకీతో కలిసి చర్చలో పాల్గొన్న సందర్బంగా కత్తి మహేష్‌ మరింతగా రెచ్చి పోయాడు.

పవన్‌ ఫ్యాన్స్‌ కొందరు ఫోన్‌లైన్‌లో కత్తి మహేష్‌తో మాట్లాడుతూ దూషించారు. దాంతో కత్తి ఊగిపోతూ పవన్‌ కళ్యాణ్‌ ఎవడు? కేవలం 10వ తరగతి చదివిన వాడికి తాను ఎందుకు గౌరవం ఇవ్వాలి, అన్న లేకుంటే లేని పవన్‌ గురించి తాను గౌరవంగా ఎందుకు మాట్లాడాలి అంటూ కత్తి మహేష్‌ మాట్లాడిన మాటలు ప్రస్తుతం మెగా ఫ్యాన్స్‌ను ఉడికిస్తున్నాయి. ఈ వివాదం కాస్త సర్దుమనుగుతుందని భావించిన వారికి కత్తి మహేష్‌ వ్యాఖ్యలు రుచించడం లేదు. ఆ మద్య రోజా ఏదో ఫ్లోలో పవన్‌ కళ్యాణ్‌ను వాడు అంటూ సంబోధించిన నేపథ్యంలో తీవ్ర విమర్శలు వ్యక్తం అయ్యాయి. ఇప్పుడు కత్తి మహేష్‌ అంతకు పది రెట్లు పవన్‌ను అవమానిస్తూ అపహాస్యం చేస్తూ విమర్శు చేయడం జరిగింది. దాంతో ఇప్పుడు కత్తిపై యుద్దంకు పవన్‌ ఫ్యాన్స్‌ సిద్దం అవుతున్నారు.