కత్తి మహేష్ బిగ్ బాస్ లోకి రాక మునుపు కొద్దిమందికి మాత్రమే పరిచయం ఉన్న ఈ పేరు ఆ తర్వాత మినీ సెలబ్రిటీ అయిపోయాడు. అయితే అప్పటికే కత్తి సినిమాలకు సమీక్షలు రాస్తూ కాస్తో… కూస్తో విశ్లేషకుడు అనే గుర్తింపు తెచ్చుకున్నాడు. పిచ్చి వ్యాఖ్యలు, కొవ్వేక్కిన వ్యాఖ్యలు చేస్తూ తనకు సంబంధం లేని వివాదాల్లో తరచూ తలదూర్చుతూ కొన్ని చానెళ్ళకి కేంద్రబింధువుగా మారాడు. ఏ ఛానల్ పిలిచినా వెళ్లి కూర్చుని ఎంచక్కా వారి ప్రశ్నలకు సమాధానాలిస్తూ అన్నిటినీ వివాదాస్పదం చేసుకోవడాన్ని కొన్ని ఛానెళ్లు బాగానే క్యాష్ చేసుకుంటున్నాయి. ఎందుకో తెలిదు కాని మొదటి నుండి జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ను టార్గెట్ గానే కత్తి వ్యాఖ్యలు చేస్తూ ఉండేవాడు.
దీంతో ఒకరకంగా పవన్ వ్యతిరేక వర్గాలకు కత్తి ఒక ఆయుధంగా మారాడు. తాము అనదలచుకున్న ప్రతి విషయాన్ని మహేష్ నోటితో చెప్పిస్తూ సినిమాలు, క్యాస్టింగ్‌కౌచ్ ఇలా ప్రతి దాంట్లోనూ తలదూర్చి పాపులారిటీ బాగానే కూడగట్టిన కత్తి వెనుక అదృశ్యశక్తులు ఎవరనే అంశంపై బోలెడు సందేహాలున్నాయి. ఒక దశలో టీడీపీ వెనుక నుంచి నడిపిస్తుందన్నారు కూడా ఇక మరో సారి… ఇదంతా… వైసీపీ చేయిస్తుందనే ఊహాగానాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలోనే కత్తి మహేష్ తాను చిత్తూరు నుంచి ఎంపీగా పోటీచేయాలని భావిస్తున్నట్లు… దీనిపై వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డితో మాట్లాడాలనకుంటున్నట్లుగా ప్రకటించాడు. కామెంట్ చేసిన మరుసటిరోజు… హిందువులు ఆరాధించే సీతారాములపై అనుచిత వ్యాఖ్యలు చేసి ఏపీ, తెలంగాణలో పదుల సంఖ్యలో పోలీసు కేసులుతో అరెస్ట్ తో మళ్ళీ మీడియా ఫోకస్ తనవైపుకు తిప్పుకున్నాడు. అయితే తాను అన్న మాటలను మీడియా వక్రీకరించిందంటూ నేను ఎవర్నీ కించపరచట్లేదని మరోసారి సమర్థించుకునే ప్రయత్నం చేసి మరలా బయటకి వచ్చాడు. అయితే ఇంత జరిగాక ఆయన వెనక ఉంది వైకాపా నాయకులేనా ? అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.






