టీవీ9 లో కత్తి సీట్ చిరిగింది… కత్తి మీద అత్యాచార ఆరోపణలు

Kathi mahesh made rape attempt on junior artist sunitha
 Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

అందరికీ శకునం చెప్పే బల్లి తాను పోయి కుడితిలో పడ్డట్టు తయారయ్యింది పాపం కత్తి మహేష్ పరిస్థితి. గత కొద్ది రోజులుగా టాలీవుడ్ లో క్యాస్టింగ్ కోచ్ అనే అంశం మీద పోరాటాలు, నిరసనలు జరుతున్న సంగతి తెలిసిందే. శ్రీ రెడ్డి అనే సినీనటి ప్రారంభించిన ఈ నిరసన ఇప్పుడు ఇండస్ట్రీ లో అనేక మంది మహిళా నటులు తమకి జరిగిన అన్యాయాన్ని బయట పెడుతున్నారు. అయితే ఈ మొత్తం కార్యక్రమాలని కొన్ని టీవీ చానెళ్ళు తమ స్టూడియో కేంద్రంగా లైవ్ ఇస్తున్నాయి. అన్యాయం జరిగిందని చెప్పుకునే మహిళలతో బాటు సినీ ఇండస్ట్రీ ప్రతినిధులలా కొంతమందిని టీవీ చానెళ్ళ వారే పిలిచి కూర్చో బెడుతున్నారు. అయితే వారిలో ఒకడిగా కత్తి మహేష్ ని కూడా చానెళ్ళు పిలిచి కుర్చోబెడుతున్నాయి. అయితే ఈరోజు కూడా టీవీ9 చర్చా కార్యక్రమంలో ఉన్న కత్తి మహేష్ కి లైవ్ కి వచ్చిన ఓ మహిళా ఆర్టిస్ట్ షాక్ ఇచ్చింది. కత్తి మహేష్ తనని బలవంతం చేసాడు అని ఆమె సంచలన ఆరోపణలు చేసింది. 

కత్తి మహేష్ ని ఎదో పెద్ద రాయుడిలాగా తెచ్చి కుర్చోబెడుతున్నారు మహిళా ఆర్టిస్ట్స్ మీద జరిగే అఘాయిత్యాలు విషయంలో అసలు కత్తి మహేష్ కూడా అలాంటోడే అయినప్పుడు అతన్ని తీసుకొచ్చి ఎలా కూర్చోబెడతారు అని ఆమె ప్రశ్నించింది. కత్తి మహేష్‌ టీవీ లైవ్ లో పక్కనుండగానే ఆయన తనను వాళ్లింటికి రమ్మని పిలిచాడని.. గదిలోకి పిలిచి తనను బలవంతం చేయశాడని.. తనను కొట్టాడని వెల్లడించింది. కత్తి మహేష్ సంవత్సరం క్రితమే తనకు ఫేస్‌బుక్ ద్వారా పరిచయమయ్యారని, ఆయన అంతకు ముందు హైటెక్ సిటీలో ఓ ప్రోగ్రాం చేసేవారని అలాగే ఒకసారి నేను అమీతుమీ ఆడియో ఈవెంట్‌లో మహేష్ కలిసినపుడు అక్కడున్న పరిస్థితిని చూసి ఆయనకు చాలా క్రేజ్ ఉన్నట్టుంది అనుకున్నానని తెలిపింది. 

అప్పటి వరకూ ఆయన నాకు జస్ట్ ఫేస్‌బుక్ ఫ్రెండ్ మాత్రమే అయిన ఆయన గురించి తనకేమి తెలియదని కాని బిగ్ బాస్ షో లో ఆయన్ని చుసిన తాను ఈయనేంటి బిగ్‌బాస్‌కి రావడమేంటని షాక్ అయ్యానని అలాగే ఎలిమినేషన్ అయ్యాక.. సర్ మీ బిగ్‌బాస్ చూశాను చాలా బాగుంది అని కాల్ చేసి చెప్పానని అయితే బిగ్‌బాస్ షోలో ఫోన్‌లో మాట్లాడినపుడు మీ వైఫ్‌తో లక్నోకి వెళ్తాను అన్నారు కదా.. ఎందుకు హైదరాబాద్‌కి వచ్చారు అని అడిగానని కాని నా మీద ఎక్కువ కాంట్రవర్సీలు వచ్చాయి కదా బిగ్‌బాస్‌లో అందుకే వెనక్కి వచ్చాను మహేష్ అన్నారని అలాగే ఆయన తిరిగి వచ్చిన రోజునే కలుస్తావా నన్ను అని అడిగారని ఆమె తెలిపింది. అయితే ఈ అంశం మీద కంప్లైంట్ ఇవ్వడానికి స్టేషన్ కి వెళ్లానని, కాని ఆ సమయంలోనే జనసేన పవన్ కల్యాణ్ సార్‌కి, కత్తి మహేష్‌కి కాంట్రవర్సీ జరుగుతోంది కాబట్టి ఆయనకీ మీడియా సపోర్ట్ ఉంటుందని మహేష్‌పై కంప్లైంట్ తీసుకోలేమని పోలీసులు చెప్పారని సునీత తెలిపింది. 

బిగ్ బాస్ కి వెళ్ళక ముందుకసారి తనను పిలిచి వాళ్లింటి బయట మాట్లాడాడని బిగ్ బాస్ నుండి వచ్చిన తర్వాత రోజునే తనను రమ్మని ఫేస్‌బుక్‌లో అడ్రస్ పెట్టాడని కావాలంటే ఫేస్‌బుక్‌లో మెసేజ్ కూడా చూపిస్తా అని ఆమె తెలిపింది. తీరా వెళ్లాక కమిట్‌మెంట్ ఇస్తావా? అని అడిగాడని కాని తాను ముందే చెప్పానని ఎవరికి పడితే వారికి కమిట్‌మెంట్ ఇవ్వనని అసలు దానికి అంగీకరించను అన్నందుకు తన మీద చేయి చేసుకుని లోపాలకి తోసి డోర్ కూడా లాక్ వేశాడని ఆమె ఆరోపించింది. తర్వాత బస్ టికెట్‌కి రూ.500 ఇచ్చి పంపించాడని కత్తి మహేష్‌ కి సంబంధించి అన్ని ప్రూఫ్స్ చూపిస్తా అని ఆమె తెలిపింది. అయితే ఈ విషయం మీద కత్తి స్పందిస్తూ సునీత తనకి మంచి ఫ్రెండ్ అని సునీత తన వద్ద డబ్బుల్లేవంటే నేను అప్పుడప్పుడు డబ్బు సాయం చేసేవాడినని ఆమె ఒకసారి తన ఇంటికి వస్తే బయటే మాట్లాడి పంపించానని తర్వాత ఇంటికి వస్తే డబ్బులిచ్చి పంపించానని అయితే నాపై సునీత అటెమ్ట్ టు రేప్ అంటూ అర్ధం లేని ఆరోపణలు చేస్తోందని తాను అలాంటివాడిని కాదని ఆమె దగ్గర ఆధారాలు ఉంటె ఆమె లీగల్ గా వెళ్ళచ్చునని తెలిపారు.       

ఈ అంశం మొత్తంగా పరిశీలిస్తే కత్తి మహేష్ ఆమె దగ్గర ఆధారాలు ఉన్నాయి అంటే వెళ్లి కేస్ పెట్టుకోమనడం చూస్తే కత్తి మహేష్ తెంపరితనం కనపడుతోంది. ఎందుకంటే ఫేస్ బుక్ లో మెసేజ్ లు ఉన్నాయని ఆమె అంటున్నా భయపడకపోవడం చూస్తే ఆ చాట్ లో భయపడే అంశాలు ఏమి ఉండి ఉండక పోవచ్చు, అలాగే ఆమెని కొట్టిన, లాగి తలుపు వేసిన ఘటనల ఆధారాలు దొరకడం అంటే కుదిరేపని కాదు, సో కత్తి మహేశ్ లీగల్ గా వెళ్ళమని ఉండచ్చు. 
 
అలాగే ఇంతకు ముందు కొంతమంది అమ్మైలతో చాట్ లు బయటపడినప్పుడు ఇలానే ఒక ఛానెల్ లో చర్చలో కూర్చోబెడితే  చర్చ మధ్యలో యాంకర్ , ”మీరు స్త్రీ లోలుడని చెబుతున్నారు” దానికి మీ సమాధానం ఏంటి అంటే అవును అమ్మాయిలకు మెసేజ్ పెట్టాను. మీరు అంటే నాకు ఇష్టం అని చెప్పాను. మీరు నాకు కావాలి అని కూడా అడుగుతా. మీరే కాదు నాకు ఎవరు నచ్చిన ఇదే మాట చెబుతాను. ఇందులో తప్పు ఏంటి ? అది నా హక్కు ఇది తప్పు ఎలా అవుతుంది అంటూ తిరిగి యాంకర్ నే ప్రశ్నించే మహేష్ ఇలా కొన్ని ఆరోపణలకి ఎలా భయ పడతాడు ? మన పిచ్చి గానీ