Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కాస్త ముందు వెనుక చూసుకోకుండా అడుగులు వేస్తే రాజకీయాల్లోనే కాదు సినీ రంగంలోనూ దెబ్బ తినాల్సి వస్తుందని లక్ష్మీపార్వతికి ఇప్పుడిప్పుడే అర్ధం అవుతోంది. స్వానుభవంతో ఆమె ఈ మాట పది మందితో చెబుతోందట. ఇంతకీ సినీ రంగంలో ఆమెని దెబ్బ తీసింది ఇంకెవరో కాదు సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఎప్పటిలాగానే తన మానాన తాను వైసీపీ లో పని చేసుకుంటున్న లక్ష్మీపార్వతిని “లక్ష్మీస్ ఎన్టీఆర్ “ పేరుతో కెలికింది వర్మ.
బాలయ్య తనకు ఎన్టీఆర్ బయోపిక్ ఛాన్స్ ఇవ్వలేదన్న కోపంతో ఆయన “లక్ష్మీస్ ఎన్టీఆర్ “ సినిమా అనౌన్స్ చేయడమే కాకుండా అందులోకి లక్ష్మీపార్వతిని లాగారు. తన తరపున J.D. చక్రవర్తిని లక్ష్మీపార్వతి ఇంటికి పంపి ఆమెతో ఈ సినిమాకి అనుమతి ఇచ్చినట్టు చెప్పించారు. ఎన్టీఆర్ ని తన కోణంలో చూపిస్తా అని చెప్పగానే లక్ష్మీపార్వతి కూడా టెంప్ట్ అయ్యారు. చంద్రబాబు మీద పగ తీర్చుకునే అవకాశం వచ్చిందని సంబరపడిపోయి ఎక్కడలేని ఉత్సాహం చూపించారు.
లక్ష్మీపార్వతి ఆనందం ఎక్కువ రోజులు నిలవలేదు. ఎక్కడో చెన్నైలో ఉంటున్న కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి ఇక్కడకి వచ్చి “ లక్ష్మీస్ వీరగ్రంధం “ పేరుతో సినిమా అనౌన్స్ చేయగానే లక్ష్మీపార్వతికి షాక్ తగిలింది. లక్ష్మీస్ ఎన్టీఆర్ కి పోటీగా వస్తూన్న లక్ష్మీస్ వీరగ్రంధం షూటింగ్, రిలీజ్ డేట్స్ త్వరత్వరగా ఖరారు అయ్యాయి. అటు లక్ష్మీస్ ఎన్టీఆర్ తో టీడీపీ నేతలతో సున్నం పెట్టుకున్న రామ్ గోపాల్ వర్మ సైలెంట్ గా నాగార్జునతో కొత్త సినిమా మొదలు పెట్టాడు. లక్ష్మీస్ ఎన్టీఆర్ గురించి ఎక్కడా నోరు మెదపడం లేదు. ఇక ఈ సినిమా నిర్మాతగా సీన్ లోకి వచ్చిన వైసీపీ నాయకుడు రాకేష్ రెడ్డి కూడా ఈ మధ్య నోరు తెరిచిన దాఖలాలు లేవు. నాగ్ సినిమా తర్వాత అయినా వర్మ “లక్ష్మీస్ ఎన్టీఆర్ “ తీస్తాడని కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. వర్మ ఇలా అనౌన్స్ చేసి వదిలేసిన సినిమాలు కోకొల్లలు. అప్పటికి వర్మ మూడ్ ఎలా ఉంటుందో ఎవరు చెప్పగలరు ?.
అటు చూస్తే కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి టీం లక్ష్మీస్ వీరగ్రంధం సినిమా మీద సీరియస్ గా వర్కౌట్ చేస్తోంది. ఆ సినిమాలో లక్ష్మీపార్వతి గురించి నెగటివ్ కోణంలో చూపిస్తారని ఈ పాటికే తేలిపోయింది. తన గురించి మంచిగా చెబుతారు అనుకున్న సినిమా ఎప్పుడు వస్తుందో తెలియదు. ఈ పరిస్థితుల్లో అనవసరంగా వర్మ మాటలు నమ్మి మోసపోయాయనని లక్ష్మీపార్వతి అనుకుంటున్నారట.