నందమూరి బాలకృష్ణ మరియు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఎన్టీఆర్. ఈ చిత్రం దాదాపుగా షూటింగ్ పూర్తికావచ్చింది. ఈ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కుతున్న సంగతి మనకు తెలిసిందే. మొదటి భాగం కథానాయకుడు పేరుతో రెండోవ భాగం మహానాయకుడు పేరుతో రాబోతుంది. ఈ చిత్రం మొదటి భాగం లో ఎన్టీఆర్ బాల్యం మరియు విద్యాభాసం, సినిమారంగ ప్రవేశం ఉంటుంది. ఇప్పటికే ఈ పాత్రలకు సంబందించిన షూటింగ్ అయిపొయింది. టాలీవుడ్ కు చెందినా ప్రముఖ హీరోస్ అండ్ హీరోయిన్స్ అలనాటి పాత్రలో నటించారు. మొదటి భాగం కథానాయకుడు వచ్చే ఏడాది జనవరి 11 న సంక్రాంతి కి విడుదల కానున్నది.
రెండవ భాగం మహానాయకుడు రెండు వారాల గ్యాప్ లో అంటే జనవరి 24 న విడుదల చేయాలి అని మొదట దర్శకుడు క్రిష్ ప్లాన్ చేశాడు, కానీ ఈ రెండు భాగాల మద్య రెండు వారలు గ్యాప్ రావడం వలన కొన్ని ఏరియాలో మొదటి భాగం ఆడుతూనే ఉంటుంది రెండవ భాగం మహానాయకుడి కి థియేటర్స్ సమస్య రావచ్చుఅని క్రిష్ భావిస్తున్నాడు. అందుకే మహానాయకుడు ని పిభ్రవరిలో విడిదల చెయ్యాలని క్రిష్ అండ్ బాలకృష్ణ భావిస్తున్నారు. కనీసం రెండింటి మద్యన ఓ నాలుగు వారలు ఉంటె కలెక్షన్స్ పరంగా గాని, థియేటర్స్ పరంగా గాని ఏలాంటి సమస్య రాదు అని క్రిష్ కుడా అనుకునట్లు సమాచారం. ఈ చిత్రంలో విద్యాబాలన్ బసవతారక పాత్రలో నటిస్తునది. ఈ చిత్రని బాలకృష్ణ తన సొంత బ్యానర్ పైన నిర్మిస్తున్నాడు. కోన వెంకట్, విష్ణు సహనిర్మాతలు గా వ్యహరిస్తున్నారు