Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
టాలీవుడ్‌లో వారసులు చాలా కామన్. అయితే ఇప్పటి వరకు వచ్చిన వారసుల్లో ఎక్కువగా హీరోల కొడుకులు మాత్రమే హీరోలుగా సెటిల్ అవ్వగలిగారు. ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోలు అంతా కూడా హీరోల వారసులుగా వచ్చిన వారే కావడం ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం. ఆ రికార్డును బ్రేక్ చేసి ఒక దర్శకుడి కొడుకు స్టార్ హీరోగా పేరు తెచ్చుకునేందుకు తాపత్రయ పడుతున్నాడు. ఆ దర్శకుడు కూడా తన కొడుకును టాలీవుడ్‌లో స్టార్‌గా నిలిపి తన సత్తా చాటాలని భావిస్తున్నాడు. ఇంతకు ఆ దర్శకుడు ఎవరో తెలుసా పూరి జగన్నాద్, ఇక హీరోగా గుర్తింపు తెచ్చుకోవాలని ఉవ్విల్లూరుతున్నది ఆయన తనయుడు ఆకాష్ పూరి.
బాలనటుడిగా ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించిన ఆకాష్ పూరి తాజాగా హీరో అయ్యేందుకు సన్నద్దం అవుతున్నాడు. ఒకటి రెండు సినిమాల్లో హీరోగా నటించినా కూడా అవి పూర్తి స్థాయిలో ఆకాష్‌ను హీరోగా చూపించడంలో విఫలం అయ్యాయి. ఆకాష్‌ను హీరోగా రీలాంచ్ చేసేందుకు పూరి చాలా ప్రయత్నాలే చేస్తున్నాడు. ఒక ప్రేమ కథను తనయుడి కోసం ఎంచుకున్నాడు. సాదా సీదా ప్రేమ కథ కాకుండా ఒక ఇండియన్ కుర్రాడికి, ఒక పాకిస్తానీ అమ్మాయికి మద్య జరిగే ప్రేమ కథను పూరి తన కొడుకు కోసం సిద్దం చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కోసం పూరి పాకిస్తాన్ కూడా వెళ్లబోతున్నట్లుగా తెలుస్తోంది. టెర్రరిస్ట్‌ల నేపథ్యంలో ఇండియా, పాకిస్తాన్‌ల మద్య ఉన్న సంబంధాల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కబోతుందని, తెలుగుతో పాటు హిందీలో కూడా సినిమాను విడుదల చేయాలని పూరి భావిస్తున్నాడు. కొడుకు కోసం వేసిన ఈ మాస్టర్ ప్లాన్ సక్సెస్ అయ్యేనో చూడాలి.
మరిన్ని వార్తలు: