Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
సూపర్ స్టార్ మహేష్‌బాబు కెరీర్‌లో నిలిచిపోయే సినిమా ‘పోకిరి’. ప్రిన్స్ మహేష్‌బాబును సూపర్ స్టార్ చేసిన సినిమాగా ‘పోకిరి’ని చెప్పుకోవచ్చు. మహేష్‌బాబులోని కొత్త యాంగిల్‌ను దర్శకుడు పూరి ఆవిష్కరించి ప్రేక్షకులకు అద్బుతమైన చిత్రాన్ని అందించాడు. ఆ సినిమాతో దర్శకుడు పూరికి కూడా మంచి పేరు వచ్చింది. ఆ సినిమాను ఇప్పటికి ప్రేక్షకులు టీవీల్లో వచ్చినా కూడా ఆధరిస్తూనే ఉన్నారు. అలాంటి సినిమాను తన కొడుకు కోసం తీయాలని దర్శకుడు పూరి ఆశపడుతున్నాడు. అందుకోపం చాలా కథలు సిద్దం చేసిన దర్శకుడు చివరకు ఒక కథను ఫైనల్ చేశాడు.
బాల నటుడిగా ఎన్నో చిత్రాల్లో నటించి మెప్పించిన ఆకాష్ పూరి హీరోగా కూడా ఒకటి రెండు సినిమాలు చేశాడు. అయితే ఆ సినిమాలు ఏవీ కూడా ఆకాష్‌కు హీరోగా గుర్తింపును తీసుకు రాలేక పోయాయి. అందుకే ఆకాష్ హీరోగా రీలాంచ్‌ను భారీగా చేయాలని పూరి భావిస్తున్నాడు. తనయుడు ఆకాష్ కోసం చిన్న సైజు పోకిరి స్క్రిప్ట్‌ను సిద్దం చేశాడని, ఒక క్యూట్ లవ్ స్టోరీని కూడా కథలో ఇన్వాల్వ్ చేయనున్నాడు. తాజాగా పూరి దర్శకత్వంలో తెరకెక్కిన ‘పైసా వసూల్’ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాలయ్య హీరోగా శ్రియ హీరోయిన్‌గా తెరకెక్కిన ఆ సినిమా తర్వాత బాలయ్య చేయబోతున్న సినిమాపై ఇటీవలే క్లారిటీ ఇచ్చాడు. తనయుడితోనే సినిమాను చేస్తాను అంటూ చెప్పుకొచ్చాడు. మరి ఆకాష్‌కు స్టార్ ఇమేజ్‌ను తీసుకు రావడంలో పూరి సక్సెస్ అవుతాడా అనేది చూడాలి.
మరిన్ని వార్తలు: