Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
సాధారణంగా రైల్వే టికెట్లు 45 రోజుల ముందు బుక్ చేసుకోవచ్చు. రద్దీ రైళ్లైతే రెండు నెలల ముందే బుక్ చేసుకోవచ్చు. కానీ ఇదంతా భారతీయులకే, అదే ఎన్నారైలతే… పండగ చేసుకోవచ్చు. ఏకంగా సంవత్సరం ముందే తమ టూర్ ప్లాన్ చేసుకోవచ్చు. రైల్వే ఎన్నారైలకు ఊహించని బహుమతి ఇచ్చింది. అప్పటికప్పుడు టికెట్లు దొరక్క ఇబ్బంది లేకుండా కూల్ గా ప్లాన్ చేసుకునే ఛాన్స్ ఇచ్చింది.
అయితే ఈ నిర్ణయం ఇంకా అమల్లోకి రాలేదు. ఈ వీకెండ్ కు అధికారిక ప్రకటన వస్తుందని భావిస్తున్నారు. రైల్వేల ఆదాయం పెంచాలని చూస్తున్న కేంద్రం… అందులో భాగంగా ఎన్నారైలకు వలేస్తోంది. విమాన మార్కెట్లో ఐదు శాతం ఆకర్షించినా చాలని రైల్వే ట్రాఫిక్ అధికారులు నివేదిక ఇచ్చారట. అందుకు అనుగుణంగా కేంద్రం పావులు కదుపుతోంది. ఈ నిర్ణయం అమలైతే మేలే అంటున్నారు ఎన్నారైలు.
అయితే ఈ రిజర్వేషనల్ మెయిల్, రాజధాని, శతాబ్ది, గతిమాన్, తేజస్ లోని ఫస్ట్ క్లాస్, సెకండ్ ఏసీ, ఎగ్జిక్యూటివ్ క్లాస్ కే పరిమితం అవుతుంది. థర్డ్ క్లాస్, స్లీపర్ క్లాస్ లో ముందస్తు రిజర్వేషన్ సదుపాయం ఉండదు. అంతేలే ఎక్కువ టికెట్ ధరలుండే వాటిని అందుబాటులో ఉంచితేనే డబ్బులొస్తాయి… సామాన్య బోగీల కోసం భారతీయులున్నారుగా అనేది రైల్వే సూత్రం కాబోలు.
మరిన్ని వార్తలు