అల్లుడు వచ్చే వరకు గోవిందుడే కింగ్‌…!

Sailaja Reddy Alludu Movie Competition On Geetha Govindam

2018 సంవత్సరం ప్రారంభం అయ్యి 8 నెలలు పూర్తి కావస్తుంది. ఇప్పటి వరకు కనీసం 8 మంచి సినిమాలు రాలేదు. ఇలాంటి సమయంలో విడుదల అయిన గీత గోవిందం చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. విజయ్‌ దేవరకొండ మార్కెట్‌ను అమాంతం పెంచేసిన గీత గోవిందం చిత్రం మొదటి రోజు కలెక్షన్స్‌ చూసి స్టార్స్‌ కూడా నోరు వెళ్లబెతున్నాడు. ఇక లాంగ్‌ రన్‌లో ఈ చిత్రం భారీ వసూళ్లను నమోదు చేయడం ఖాయంగా సినీ వర్గాల వారు చెబుతున్నారు. ఈ చిత్రానికి సమీపంలో కొత్త సినిమాలు ఏమీ లేకపోవడం, ఇప్పటికే విడుదలైన చిత్రాల్లో ఏ ఒక్కటి కూడా గోవిందుడికి పోటీని ఇచ్చే అవకాశం లేదు.

nag-devarakonda

ఆగస్టు 31న ‘శైలజ రెడ్డి అల్లుడు’ చిత్రం విడుదల కాబోతుంది. ఆ చిత్రం విడుదల అయ్యే వరకు గీత గోవిందం చిత్రంకు పోటీ అనేది లేదు. రెండు వారాంతాలతో దుమ్ము దుమ్ముగా గోవిందుడు వసూళ్లను సాధించుకునే అవకాశం ఉంది. సక్సెస్‌ మూవీకి ఇలాంటి స్కోప్‌ ఉంటే కలెక్షన్స్‌ వర్షం కురవడం ఖాయం. మొదటి వారంతంతోనే ఈ చిత్రం 30 కోట్ల క్లబ్‌లో చేరడం ఖాయంగా చెబుతున్నారు. ఇక రెండవ వారాంతంకు మరో 20 కోట్ల వరకు నమోదు అయ్యే అవకాశం ఉంది. మొత్తంగా 50 కోట్లను గోవిందుడు వసూళ్లు చేస్తాడు అంటూ ట్రేడ్‌ పండితులు చెబుతున్నారు. ప్రస్తుతం సినిమాకు పోటీ లేదు కనుక దూసుకు పోతుంది. శైలజ రెడ్డి అల్లుడు ఫలితం తారుమారు అయితే ఈ లెక్కలు మళ్లీ మారిపోయే అవకాశం ఉంది. మొత్తానికి గీత గోవిందం చిత్రం పంట పండినట్లే అని చెప్పుకోవచ్చు.

nagachaitanya