కొన్ని వారాల క్రితం తెలుగు మరియు తమిళంలో రామాయణంలోని ఒక పాత్ర అయిన శూర్పణక నేపథ్యంలో ఒక చిత్రాన్ని తెరకెక్కించేందుకు భార్గవ్ ఏర్పాట్లు చేస్తున్నట్లుగా వార్తలు వచ్చిన విషయం తెల్సిందే. శూర్పణక పాత్ర కోసం ఆయన కాజల్ ను కూడా సంప్రదించాడంటూ వార్తలు వచ్చాయి. సోషియో ఫాంటసీ చిత్రంగా శూర్పణక తెరకెక్కబోతుందని వార్తలు వచ్చాయి. కాజల్‌కు ఒక అద్బుతమైన పాత్ర దక్కిందని ఆమె అభిమానులు సంతోషిస్తున్నారు. త్వరలో షూటింగ్ అనుకుంటున్న సమయంలో హఠాత్తుగా కాజల్ స్థానంలో సమంత అంటూ సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి.
భార్గవ్ ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్‌లో బిజీగా ఉన్నాడు. మరో మూడు లేదా నాలుగు నెలల్లో సినిమాను పట్టాలెక్కించేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆ సమయంలో కాజల్ డేట్లు ఖాళీ లేవని, అందుకే ఆ స్థానంలో సమంతను తీసుకోబోతున్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. కాని అసు విషయం ఏంటీ అంటే ఈ చిత్రం కోసం కొన్ని టెస్టు షూట్స్‌ను నిర్వహించారు. ఆ టెస్టు షూట్స్‌లో కాజల్ అంతగా మెప్పించలేక పోయిందట. దాంతో ఆమె స్థానంలో సమంతను ఎంపిక చేయాలనే నిర్ణయానికి దర్శకుడు భార్గవ్ వచ్చాడు. 2020వ సంవత్సరంలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.