అక్కినేని నాగచైతన్య నటించిన ‘సవ్యసాచి’ చిత్రం విడుదలకు సిద్దంగా ఉంది. దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కించిన ఈ చిత్రంలో హీరోయిన్‌గా నిధి అగర్వాల్ నటించింది. ఇటీవలే ట్రైలర్ విడుదలయ్యి సినిమాపై అంచనాలను పెంచుతోంది. నేడు ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ప్లాన్ చేశారు. కాగా ‘సవ్యసాచి’ విడుదల మంచి టైమింగ్‌లో జరుగుతుందని విశ్లేషకులు అంటున్నారు. హిట్ టాక్‌ను సొంతం చేసుకున్న ‘అరవింద సమేత’ చిత్రం ఇక ముగింపు దశకు చేరుకుంది. ‘హలోగురు ప్రేమకోసమే’ చిత్రానికి కూడా ముగింపు దశ వచ్చినట్టే. సో ‘సవ్యసాచి’కి అడ్డుగా ఏమి లేకోవడంతో చైతూకు ఢోకా లేదు.
తాజాగా విడుదలయిన ట్రైలర్ ‘సవ్యసాచి’పై ఆసక్తిని పెంచుతోంది. అంతేకాకుండా దర్శకుడు చందూ మొండేటిపై ప్రేక్షకులకు నమ్మకం ఉంది. ప్రస్తుతం ఏ చిత్రం కూడా ‘సవ్యసాచి’కి పోటీగా లేదు. కథ నచ్చలేగాని దీపావళి పండగను బాగా వాడుకోవచ్చు. ‘టాక్సీవాలా’ విడుదల వరకు చైతూ ‘సవ్యసాచి’కి మంచి ఛాన్స్. ఈలోపు కొన్ని చిత్రాలు ఉన్నాయి కానీ అవి డబ్బింగ్ చిత్రాలు కావడంతో చైతూకు నో ప్రాబ్లమ్. కథ కనెక్ట్ అయ్యేలా ఉంటే ఇది చైతూకు మంచి ఛాన్స్ అవుతుంది. ఈ చిత్రంలో విన్‌గా మాధవన్, చైతూ అక్కగా భూమిక నటించారు. విన్‌గా మాధవన్ పాత్ర కొంత ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది.