శర్మానంద్‌ మూవీ రీషూట్‌.. రిలీజ్‌ వాయిదా…!

Sharwanand Movie Release On Next Year

ఈమద్య శర్వానంద్‌ సినిమాల సంఖ్య కాస్త తగ్గించినట్లుగా అనిపిస్తుంది. ఈయన గత చిత్రం విడుదలై నెలలు గడుస్తున్నా కూడా ఇంకా కొత్త సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాలేదు. ప్రస్తుతం ఈయన ఫ్లాప్‌ డైరెక్టర్‌ హను రాఘవపూడి దర్శకత్వంలో ‘పడి పడి లేచే మనసు’ అనే చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే. సాయి పల్లవి హీరోయిన్‌గా రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్‌ ముందుగా అనుకున్న ప్రకారం అయితే వచ్చే నెలతో పూర్తి అవ్వాల్సి ఉంది. డిసెంబర్‌లో సినిమా విడుదల చేయాలని అనుకున్నారు. కాని అన్ని అనుకున్నట్లుగా ఈ చిత్రం విషయంలో జరగడం లేదు అంటూ సమాచారం అందుతుంది.

sarvandh-movies

సినీ వర్గాల నుండి అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ చిత్రంకు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాల విషయంలో మార్పులు చేర్పులు చేస్తున్నారట. ఆ కారణంగా దాదాపు నెల రోజుల పాటు అదనంగా చిత్రీకరణ చేయాల్సి ఉందట. ఇప్పటికే తెరకెక్కించిన కొన్ని సీన్స్‌ను కూడా రీ షూట్‌ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి సినిమాను జనవరి చివర్లో లేదా ఫిబ్రవరిలో విడుదల చేయాలని నిర్ణయించుకున్నాడు. అది కూడా వీలు పడకుంటే మే వరకు సినిమాను వాయిదా వేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ చిత్రంలో సాయి పల్లవి నటించిన కారణంగా అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అంచనాలను అందుకునే ఉద్దేశ్యంతో దర్శకుడు హను రాఘవపూడి ఈ రీషూట్‌ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇందుకు శర్వా కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో ఆలస్యం అయినా పర్వాలేదు అని రీ షూట్‌ ప్లాన్‌ చేస్తున్నారు

padilechave-manasu