సోమనాద్ భౌతికకాయానికి అంత్యక్రియలు నిలుపుదల….అందుకే !

Somnath chatterjee s Body is to be handover to medical college

నేటి ఉదయం తుదిశ్వాస విడిచిన లోక్‌సభ మాజీ స్పీకర్ మృత‌దేహానికి అంత్యక్రియలను నిర్వహించడం లేదని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఒక ప్రకటన చేశారు. అందుతున్న సమాచారం మేరకు మరణానంతరం తన మృత‌దేహాన్ని ఏదైనా మెడికల్ కాలేజీకి ఇవ్వాలనేది సోమ్‌నాథ్ చటర్జీ బ్రతికుండగా తీసుకున్న నిర్ణయం. ఆయన 2002లోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. వైద్య పరిశోధనలకు ఉపయోగపడే విధంగా తన భౌతిక కాయాన్ని ఏదైనా మెడికల్ కాలేజీకి ఇవ్వాలని ఆయన అప్పట్లోనే తన సన్నిహితులను కోరినట్టుగా తెలుస్తోంది.

Somnath chatterjee s Body

ఆ మేరకు ఇప్పుడు సోమ్‌నాథ్ భౌతిక కాయాన్ని ఎస్ఎస్‌కేఎమ్ కాలేజీకి అప్పగించబోతోంది పశ్చిమబెంగాల్ ప్రభుత్వం. అందుకే సోమ్‌నాథ్ చటర్జీ సోమ్‌నాథ్ చటర్జీ బతికున్న రోజుల్లో తీసుకున్న నిర్ణయం మేరకే ఆయన మృత‌దేహాన్ని కోల్‌కతాలోని ఎస్ఎస్‌కేఎమ్ మెడికల్ కాలేజీకి ఇవ్వబోతున్నట్టుగా మమత ప్రకటించారు. స్వతహాగా లాయర్ అయిన చటర్జీకి పశ్చిమబెంగాల్ హై కోర్టుతో అనుబంధం ఉంది. ఆయనకు నివాళిగా భౌతిక కాయాన్ని కాసేపు హైకోర్టు వద్ద ఉంచి అనంతరం అక్కడ నుంచి పశ్చిమబెంగాల్ అసెంబ్లీకి తరలించి అక్కడ కాసేపు ఉంచారు. సాయుధ బలగాల నివాళి ఘటించిన అనంతరం మృత‌దేహాన్ని మెడికల్ కాలేజీకి అప్పగించనున్నట్టుగా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ప్రకటించింది.