Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
రియల్ స్టార్ శ్రీహరి భార్య డిస్కో శాంతి. ఈమె అప్పట్లో పలు ఐటెం సాంగ్స్ చేయడంతో పాటు ఎన్నో చిత్రాల్లో వ్యాంప్ పాత్రలు చేయడం జరిగింది. కొన్ని సినిమాల్లో హీరోయిన్గా కూడా నటించి పర్వాలేదు అనిపించింది. తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న డిస్కో శాంతి హృదయాన్ని శ్రీహరి గెలుచుకున్నాడు. ఇద్దరు పెళ్లి చేసుకుని చాలా సంతోషకంరగా వైవాహిక జీవితాన్ని గడిపారు. అంతలోనే వారి జీవితంలో కుదుపు. శ్రీహరి అనారోగ్య కారణంగా మృతి చెందాడు. శ్రీహరి చనిపోయిన సమయంలో ఆయనకు డ్రగ్స్ అలవాటు ఉండేదని, ఆ కారణంగానే అనారోగ్యం భారిన పడ్డట్లుగా వార్తలు వచ్చాయి. కాని అవి ఎక్కువ ప్రాచుర్యం పొందలేదు.
తాజాగా డిస్కో శాంతి మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె క్లారిటీ ఇచ్చారు. తాను గతంలో డ్రగ్స్ తీసుకున్న మాట వాస్తవమే, బావ చనిపోయిన తర్వాత కూడా డ్రగ్స్ తీసుకున్నాను. కాని నా ఆరోగ్యం తీవ్రంగా క్షీణించిన కారణంగా ఇప్పుడు డ్రగ్స్ మానేశాను. డ్రగ్స్ ఇంకా కొనసాగిస్తే తన జీవితాన్ని కోల్పోవాల్సి వస్తుందనిడాక్టర్లు చెప్పారు. ఆ కారణంగానే పిల్లల కోసం తాను డ్రగ్స్‌కు దూరం అయ్యాను అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుత తన అనారోగ్య సమస్యలకు, తాను ఇలా అవ్వడానికి పూర్తిగా డ్రగ్స్ కారణం అని చెప్పుకొచ్చింది. ఈమె మాటలను బట్టి చూస్తుంటే శ్రీహరి కూడా డ్రగ్స్ కారణంగానే మృతి చెంది ఉంటాడు అని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని వార్తలు: