Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
వైసీపీ ప్లీనరీ సందర్భంగా ఆ పార్టీ అధినేత జగన్ నుంచి పాదయాత్ర ప్రకటన రావొచ్చని జోరుగా ప్రచారం సాగుతోంది. వైసీపీ శ్రేణులు కూడా ఈ విషయాన్ని గట్టివనే భావిస్తున్నాయి. తండ్రి వై.ఎస్, రాజకీయ ప్రత్యర్థి చంద్రబాబు కూడా ఒకప్పుడు ఈ పాదయాత్ర అస్త్రంతోనే అధికార పీఠాన్ని అధిష్టించిన విషయం దృష్టిలో ఉంచుకుని జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కూడా మద్దతు ఇవ్వడంతో పాదయాత్ర కి సంబంధించిన ప్రాధమిక కసరత్తు కూడా మొదలైనట్టు చెప్పుకుంటున్నారు. అయితే ఈ పాదయాత్ర నిజంగా జరుగుతుందా అన్న దానిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆ కారణాలు ఏమిటో చూద్దాం.
జగన్ కంపెనీల్లో అక్రమ పెట్టుబడులకు సంబంధించి వివిధ కేసులు నడుస్తున్నాయి. వాటి కోసం దాదాపు ప్రతి వారం జగన్ కోర్టుకి వెళ్లాల్సి ఉంటుంది. నిన్న కోర్టుకి హాజరు కానందుకు సిబిఐ న్యాయస్థానం జగన్ న్యాయవాది మీద ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. పైగా పార్టీ సమావేశం అనే కారణం చూపడాన్ని కూడా కోర్టు తప్పుబట్టింది. నిందితులందరికీ ఏవో ఒక పనులుంటాయి, అలాగని కోర్టుకి రాకపోతే ఎలా అని న్యాయమూర్తి ప్రశ్నించారు. భవిష్యత్ లో ఇలాంటి కారణాలు చెప్పి కోర్టుకి హాజరు కాకపోతే అరెస్ట్ వారెంట్ ఇవ్వాల్సి ఉంటుంది అని కోర్టు హెచ్చరించింది. ఇలా కోర్టుల నుంచి సుదీర్ఘ పాదయాత్ర పేరు చెప్పి తపించుకోవడం సాధ్యం కాకపోవచ్చు.
ఇక మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా తేలిగ్గా పాదయాత్రలకు అనుమతి ఇచ్చే పరిస్థితిలో లేదు. అప్పట్లో తుని విధ్వంసం, ఇప్పుడు mrps ఆగ్రహ జ్వాలలు చూసాక శాంతిభద్రతల పరిస్థితికి అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని పోలీసులు పదేపదే చెబుతున్నారు. అందుకు భిన్నంగా వ్యవహరిస్తూ అనుమతి తీసుకోకుండా పదేపదే పాదయాత్ర షెడ్యూల్ ప్రకటిస్తున్న ముద్రగడ ఇప్పటికి ఒక్క కిలోమీటర్ కూడా నడవలేకపోయారు. ఇప్పుడు mrps వ్యవహారం చూసాక జగన్ పాదయత్రకి సులభంగా అనుమతి దొరక్కపోవచ్చు. ఈ రెండు కారణాలతో జగన్ పాదయత్రకి బ్రేక్ పడొచ్చు.
మరిన్ని వార్తలు