Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
బాలకృష్ణ 102వ సినిమా షూటింగ్ మొదలయింది. ఇటీవలే పైసా వసూల్ సినిమా కంప్లీట్ చేసిన బాలయ్య విరామమేమీ తీసుకోకుండానే తదపరి చిత్రం షూటింగ్ లో పాల్గొంటున్నారు. తమిళ దర్శకుడు కె.ఎస్ . రవికుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. సి. కె. ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై సి. కళ్యాణ్ నిర్మిస్తున్నారు. బాలకృష్ణ సరసన ముచ్చటగా మూడోసారి నయనతార నటిస్తోంది. గతంలో వీరిద్దరూ కలిసి నటించిన సింహ, శ్రీరామరాజ్యం భారీవిజయాలను నమోదుచేసుకున్నాయి. రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ లాంఛనంగా మొదలయింది. ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను క్లాప్కొట్టగా, ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ కార్పొరేషన్ చైర్మన్ అంబికా కృష్ణ కెమెరా స్విచ్చాన్ చేశారు. షూటింగ్ శరవేగంగా పూర్తిచేసి 2018 సంక్రాంతికి చిత్రాన్ని విడుదల చేయాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు. సంక్రాంతి హీరోగా బాలయ్యకు తిరుగులేని రికార్డు ఉండటంతో సెంటిమెంటుగా ఈ సినిమాను అప్పుడే విడుదల చేయాలని చిత్రయూనిట్ ఆలోచన. సినిమాకు రూలర్ అనే టైటిల్ ఖరారుచేసినట్టు తెలుస్తోంది.
మరిన్ని వార్తలు:
వీరిద్దరు ప్రేక్షకుల హృదయాలను గెల్చుకున్నారు
ఇకపై అలా చేయను
నిజంగా ఎన్టీఆర్ ట్యాక్ ఎగవేశాడా?