Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
యువ హీరో నితిన్ కొన్ని సంవత్సరాల క్రితం ఎన్ని డిజాస్టర్స్‌ను ఎదుర్కొన్నాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటి వరకు ఇండియాలోనే కాదు ఏ ఇతర దేశంలోని సినీ పరిశ్రమలో కూడా అన్ని ఫ్లాప్‌లు అయిన తర్వాత మళ్లీ సక్సెస్‌లు దక్కించుకోవడం జరగలేదు. ఒకటి లేదా రెండు లేదంటే అయిదు అంతకంటే ఎక్కువ సినిమాలు ఫ్లాప్ అయితే ఆ హీరోను ప్రేక్షకులు మర్చి పోతారు. అలాగే ఆయనతో సినిమాలు చేసేందుకు ఏ ఒక్కరు సాహసం చేయరు. కాని నితిన్ మాత్రం డజను ఫ్లాప్‌లు వచ్చిన అదృష్టంతో మళ్లీ సక్సెస్‌లు దక్కించుకున్నాడు. ఇటీవల ‘అఆ’ చిత్రంతో స్టార్ ఇమేజ్ను సొంతం చేసుకున్నాడు.
‘అఆ’ వంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ దక్కిన తర్వాత నితిన్ చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సి ఉంటుంది. కాని అనాలోచితంగా ‘లై’ చిత్రాన్ని చేసి మళ్లీ ఫ్లాప్ అయ్యాడు. దర్శకుడి ట్రాక్ రికార్డు చూసి నితిన్ ఈ సినిమాకు కమిట్ అయ్యి ఉంటాడు. అయితే దర్శకుడు హను రాఘవపూడి గత రెండు చిత్రాలు చిన్న బడ్జెట్ చిత్రాలు, ఒక మంచి ప్రేమ కథతో తెరకెక్కిన చిత్రాలు. కాని ఈ సినిమా భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది. విభిన్న కథాంశంతో తెరకెక్కడంతో, దర్శకుడు హను ఆ కథను హ్యాండిల్ చేయడంలో విఫలం అయ్యాడు. నితిన్ కథను మరియు దర్శకుడిని జడ్జ్ చేయడంలో విఫలం అయ్యాడు. ఇప్పుడిప్పుడే కెరీర్ గాడిలో పడుతున్న సమయంలో ఇలాంటి నిర్ణయం చాలా పెద్ద తప్పు అని ఆయన సన్నిహితులు కూడా ఇప్పుడు అంటున్నారు.
మరిన్ని వార్తలు: