Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
బోయపాటి శ్రీను దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘జయ జానకి నాయక’. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా భారీ బడ్జెట్తో తెరకెక్కుతుంది. ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్న ఈ సినిమా దాదాపుగా పూర్తి అయ్యింది. ఇటీవలే ఒక పాటను ఏకంగా మూడు కోట్లు ఖర్చు పెట్టి చిత్రీకరించినట్లుగా చిత్ర యూనిట్ సభ్యుల ద్వారా తెలుస్తోంది. ఈ స్థాయిలో కేవలం దర్శకుడు శంకర్ మాత్రమే పాటలను చిత్రీకరిస్తూ ఉంటాడు. ప్రస్తుతం ‘2.0’ చిత్రం కోసం ఏకంగా 5 కోట్లు పెట్టి ఒక పాటను చిత్రీకరిస్తున్నాడు. అదే తరహాలో బోయపాటి మూడు కోట్లతో పాటను చిత్రీకరించడం అందరిని అవాక్కయ్యేలా చేస్తుంది.
ఒక తెలుగు సినిమాలో పాటకు ఈ స్థాయిలో ఖర్చు చేయడం ఇదే ప్రథమం కావచ్చు. అది కూడా ఒక చిన్న హీరోకు ఇంత బడ్జెట్తో పాటను చిత్రీకరించడం అంటే మరీ ఎక్కువ అన్నట్లుగా చెప్పుకోవచ్చు. విశాఖపట్నంలోని బీచ్లో భారీ సెట్టింగ్ వేసి విదేశాల నుండి వందల సంఖ్యలో డాన్సర్స్ను పిలిపించి మరీ ఈ పాటను చిత్రీకరించినట్లుగా తెలుస్తోంది. బోయపాటి శ్రీను ఒక్క పాట కోసం ఇంత ఖర్చు చేయడంపై అంతా కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రేమ్ రక్షిత్ మాస్టర్ ఆధ్వర్యంలో ఈ పాటను చిత్రీకరించినట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలను పెంచుతోంది. సినిమా కూడా అదే స్థాయిలో ఉంటుందనే నమ్మకంతో ప్రేక్షకులు ఉన్నారు.
మరిన్ని వార్తలు: