Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
మెగా హీరో వరుణ్ తేజ్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యి చాలా సంవత్సరాలైంది. ఎట్టకేలకు వరుణ్ తేజ్‌కు ‘ఫిదా’ రూపంలో సూపర్ హిట్ దక్కింది. ‘ఫిదా’ సినిమాతో కమర్షియల్ సక్సెస్ దక్కిన వరుణ్ తేజ్ ఇప్పుడు జెట్ స్పీడ్‌తో దూసుకు పోయేందుకు సిద్దం అవుతున్నాడు. ‘ఫిదా’ సక్సెస్‌ను క్యాష్ చేసుకునేందుకు వరుణ్ తేజ్ సిద్దం అవుతున్నాడు. ప్రస్తుతం వరుణ్ తేజ్ నటిస్తున్న సినిమాకు వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నాడు. విభిన్న ప్రేమ కథా చిత్రంగా ఈ సినిమాను ఆయన తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ సినిమాకు పవన్ కళ్యాణ్ టైటిల్‌ను పెట్టాలని చిత్ర యూనిట్ సభ్యులు ప్లాన్ చేస్తున్నారు. అందుకోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి.
పవన్ కెరీర్ ఆరంభంలో సూపర్ హిట్ అయిన ‘తొలిప్రేమ’ సినిమా టైటిల్‌ను ఇప్పుడు వరుణ్ తేజ్ వాడబోతున్నట్లుగా తెలుస్తోంది. కరుణాకర్ దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న సినిమాకు ఆ టైటిల్‌ను అనుకున్నారు. కాని వరుణ్ తేజ్‌కు అయితే ఆ టైటిల్ బాగా యాప్ట్ అవుతుందనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. వెంకీ అట్లూరి ఈ టైటిల్‌కు తగ్గట్లుగా సినిమాను తెరకెక్కించే పనిలో ఉన్నాడు. రాశిఖన్నా హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ గత చిత్రాలతో పోల్చితే విభిన్నంగా కనిపించబోతున్నాడు. త్వరలోనే షూటింగ్‌ను పూర్తి చేసి, ఇదే సంవత్సరంలో సినిమాను విడుదల చేయాలని వెంకీ అట్లూరి ప్లాన్ చేస్తున్నాడు. బాబాయి టైటిల్‌తో రాబోతున్న అబ్బాయికి సక్సెస్ దక్కుతుందా అనేది చూడాలి.
మరిన్ని వార్తలు: