Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నందమూరి బాలకృష్ణ 100వ సినిమా ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ చిత్రం విడుదలైన తర్వాత కొన్ని రోజులకు తాను తన తండ్రి నందమూరి తారకరామారావు గారి జీవిత చరిత్రతో ఒక సినిమాను తీస్తాను అంటూ ప్రకటించాడు. బాలయ్య ప్రకటన వచ్చిన వెంటనే సినీ వర్గాలతో పాటు నందమూరి ఫ్యాన్స్ మరియు రాజకీయ వర్గాల్లో కూడా చర్చ మొదలైంది. కొందరు చంద్రబాబును విలన్‌గా చూపిస్తేనే ఎన్టీఆర్ సినిమాకు న్యాయం జరిగినట్లుగా అవుతుందని అభిప్రాయం వ్యక్తం చేయగా, మరి కొందరు లక్ష్మి పార్వతి కారణంగానే ఆయన జీవితం నాశనం అయ్యింది, అందుకే ఆమెను విలన్‌గా చూపించాలంటూ డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ కథ ఎక్కడ మొదలు పెట్టి ఎక్కడ ఎండ్ చేస్తారు అనే విషయంపై కూడా సర్వత్రా ఆసక్తికర చర్చ జరిగింది. ఇంత చర్చ జరుగుతున్న సమయంలో బాలయ్య ఆ ప్రాజెక్ట్‌ను పక్కకు పెట్టేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం నందమూరి బాలకృష్ణ తన తండ్రి జీవిత చరిత్ర చిత్రాన్ని వదిలేశాడట. కారణం పలువురు సినీ ప్రముఖులు మరియు రాజకీయ నాయకులు కూడా ఆ సినిమా తీయడం వల్ల అనవసర వివాదాలు, విమర్శలు వస్తాయి అని, ఆయన సినిమాను ఎలా తీసినా కూడా ప్రేక్షకులు ఆధరించడం కష్టమే అనే అభిప్రాయంను కొందరు వ్యక్తం చేస్తున్నారు. దాంతో బాలయ్య సాహసం చేయడం ఎందుకు అని తన నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం బాలయ్య పూరి దర్శకత్వంలో ఒక సినిమాను, కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో మరో సినిమాను చేస్తున్నాడు. ఆ తర్వాత బోయపాటి దర్శకత్వంలో కూడా మరో సినిమాను బాలయ్య చేయబోతున్నాడు. అంతే తప్ప ఎన్టీఆర్ బయో పిక్‌ను మాత్రం చేయడం లేదు. బాలయ్య పక్కకు పెట్టిన ఎన్టీఆర్ బయోపిక్‌ను రామ్‌గోపాల్ వర్మ చేస్తాను అంటూ ఆ మద్య ప్రకటించిన విషయం తెల్సిందే.
మరిన్ని వార్తలు: